Trisha: ‘విజయ్, అజిత్ లలో ఎవరు నెంబర్ వన్..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయిన త్రిష ఇక్కడ అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. రీసెంట్ గా ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ బ్యూటీ నటించిన ‘రాంగి’ అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది త్రిష. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె దిల్ రాజు చేసిన వ్యాఖ్యలపై స్పందించింది.

తమిళనాడులో విజయ్ నెంబర్ హీరో అంటూ దిల్ రాజు ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేయడంతో అజిత్ ఫ్యాన్స్ అతడిపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు త్రిషను విజయ్, అజిత్ లలో ఎవరు నెంబర్ వన్ స్టార్ అని ప్రశ్నించగా.. ‘ఇద్దరూ చాలా అనుభవం ఉన్న నటులు. ఇద్దరికీ స్టార్ స్టేటస్ ఉంది. వీరిలో ఎవరు నెంబర్ వన్ అనేది చెప్పడం కష్టం’ అని చెప్పింది. వ్యక్తిగతంగా తనకు నెంబర్ గేమ్స్ పై నమ్మకం లేదని..

మనం నటించిన చివరి సినిమా మంచి విజయం అందుకుంటే నెంబర్ వన్ గా ఉంటామని, లేదంటే ఆ స్థానములో మరొకరు వస్తారని తెలిపింది. తను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందే విజయ్, అజిత్ లు స్టార్ స్టేటస్ అందుకున్నారని.. ఇద్దరూ పెద్ద స్టార్లు అయినప్పుడు ఎవరో ఒకరిని ఎన్నుకోవడం కష్టమని చెప్పుకొచ్చింది. ఇక త్రిష.. దాదాపు పదిహేనేళ్ల తరువాత విజయ్ తో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఈ సినిమాకి ఇంకా పేరు పెట్టలేదని తెలుస్తోంది. ఇక ఆమె నటించిన ‘రాంగి’ సినిమా విషయానికొస్తే.. డిసెంబర్ 30న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇందులో త్రిష జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో సోలో హిట్టు కొట్టాలని చూస్తుంది త్రిష.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus