మొదటి సినిమా “మెంటల్ మదిలో” కమర్షియల్ గా వర్కవుట్ అవ్వకపోయినా.. “బ్రోచేవారెవరురా”తో తన దర్శకత్వ ప్రతిభను ఘనంగా చాటుకొన్నాడు వివేక్ ఆత్రేయ. “బ్రోచేవారెవరురా” కథ-కథనం ప్రేక్షకులతోపాటు ఇండస్ట్రీ పెద్దలను కూడా విశేషంగా ఆకట్టుకొంది. దాంతో.. అన్ని ప్రముఖ నిర్మాణ సంస్థల నుండి ఆఫర్లు వచ్చాయి. అందులో ముఖ్యమైనది సీతారా ఎంటర్ టైన్మెంట్స్.
“బ్రోచేవారెవరురా” చూసిన త్రివిక్రమ్ కి వివేక్ పనితనం బాగా నచ్చిందట. అందుకే పర్సనల్ గా ఈ ప్రొజెక్ట్ లో ఇన్వాల్వ్ అవుతున్నాడని తెలుస్తోంది. అలాగే.. దిల్ రాజు కూడా ఈ ప్రొజెక్ట్ కు సమర్పకుడిగా వ్యవహరించనున్నాడు.తంతే బూర్ల బుట్టలో పడినట్లు.. ఒకేసారి త్రివిక్రమ్-దిల్ రాజుల వంటి ప్రముఖల చేతిలో వివేక్ కెరీర్ పడిందంటే.. ఇక మనోడికి అడ్డే ఉండదు. మరి వివేక్ తన మూడో సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూద్దాం.