Trivikram, Jr NTR: దేవరపై అంచనాలు పెంచిన ఎన్టీఆర్, త్రివిక్రమ్.. ఇండస్ట్రీ షేక్ కానుందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరో సినిమా కోసం తారక్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. టిల్లూ స్క్వేర్ సక్సెస్ మీట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేవర మూవీ 1000 కోట్ల రూపాయల వసూళ్లు సాధించాలని ఆకాంక్షించారు. ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు దేవర నామ సంవత్సరం కావాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే దేవర సినిమా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించడం సులువైన విషయం కాదు. దసరా పండుగకు దేవర రిలీజవుతున్న సమయంలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. ఆ సినిమాలపై కూడా ఒకింత భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం దేవర సినిమాకు తిరుగుండదని చెప్పవచ్చు. దేవర గ్లింప్స్ కొత్తగా ఉండటంతో పాటు ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చింది.

జూనియర్ ఎన్టీఆర్ సైతం ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా ఈ సినిమా ఉంటుందని చెప్పి ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు. జూనియర్ ఎన్టీఆర్ జడ్జిమెంట్ చాలా సందర్భాల్లో నిజం కావడంతో దేవర విషయంలో కూడా ఆ నమ్మకం నిజమవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దేవర మూవీ లేటవుతున్నా అభిమానులను ఏ మాత్రం నిరాశపరచదని ఎన్టీఆర్ చెబుతున్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలైన రెండున్నర సంవత్సరాల తర్వాత ఈ సినిమా రిలీజవుతోంది. సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ ను సైతం ఈ సినిమా డిసైడ్ చేయనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఆర్ఆర్ఆర్ తర్వాత భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని తెలుస్తోంది. మాస్ ప్రేక్షకులను మెప్పించేలా దేవర సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది. దేవర సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారని వార్తలు వినిపిస్తుండగా తారక్ సెకండ్ లుక్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus