పవన్ కళ్యాణ్ కి హీరోగా పూర్వవైభవం తీసుకురావడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ హస్తం ప్రధానంగా ఉంది. అత్తారింటికి దారేదితో పవన్ క్రేజ్ భారీగా ఉంది. ఇందులో అతను చెప్పిన డైలాగులు బాగా ఫేమస్ అయ్యాయి. అలాగే జనసేన పార్టీ ఏర్పాటు చేసినప్పుడు పవన్ ప్రసంగానికి త్రివిక్రమ్ స్క్రిప్ట్ అందించారని అప్పట్లో రూమర్ షికారు చేసింది. పవన్ మాటల్లో త్రివిక్రమ్ కనిపించడంతో అందరూ అది నిజమనుకున్నారు. అయితే అప్పటికి ఇప్పటికీ పవన్ లో మార్పు వచ్చింది. జనసేన అధినేతగా తనదైన శైలిలో మాట్లాడి ఆకట్టుకుంటున్నారు. నిన్న గుంటూరు సభలో మాట్లాడిన విధానం అందరినీ ఆకర్షించింది.
ఆయన మాటల వెనుక త్రివిక్రమ్ లేరని విమర్శకులు సైతం తేల్చి చెప్పారు. కొత్త టీమ్ పవన్ కి అండగా నిలిస్తోందని వెల్లడించారు. దీంతో త్రివిక్రమ్, పవన్ కి దూరం పెరిగిందా ? అనే అనుమానాలు తలెత్తాయి. అయితే పవన్ కి అత్యంతసన్నిహితులైన వారు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. “పవన్ కి త్రివిక్రమ్ మధ్య స్నేహం అలాగే ఉంది. కలిసి సినిమాలు నిర్మిస్తారు. అయితే పొలిటికల్ గా త్రివిక్రమ్ నుంచి ఎటువంటి సలహాలు పవన్ కోరుకోవడం లేదు. అడగడానికి కూడా ఇష్టపడడం లేదు” అని స్పష్టం చేశారు.