‘మహేష్ 28’ .. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఫిక్స్..!

మహేష్ బాబుతో ‘జన గణ మన’ అనే ప్రాజెక్టుని తెరకెక్కించాలి అని ఎప్పటి నుండో అనుకుంటున్నాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఓ సారి మహేష్ బాబు పుట్టినరోజు నాడు ట్విట్టర్ లో కూడా.. ఓ పోస్టర్ ను పోస్ట్ చేసి ఈ విషయాన్ని అభిమానులకు తెలిపాడు పూరి. కానీ మహేష్ ఈ ప్రాజెక్టు పట్ల ఇంట్రెస్ట్ చూపించలేదు.’కచ్చితంగా ఈ ప్రాజెక్టే చేద్దాం’ అని మహేష్ తో పూరి తెగేసి చెప్పాడని.. ‘అందుకే ఇతన్ని మహేష్ దూరం పెట్టాడని’ అప్పట్లో కథనాలు వినిపించాయి.

అందులో నిజం ఎంతుందో తెలీదు.గతంలో వీరి కాంబినేషన్లో ‘పోకిరి’ ‘బిజినెస్మెన్’ వంటి బ్లాక్ బస్టర్లు వచ్చాయి. దాంతో.. ఫ్యాన్స్ కూడా ఈ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ రావాలని కోరుకుంటున్నారు. అయితే త్వరలోనే ఈ కాంబినేషన్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉందట. ఈ మధ్యనే పూరి నిర్మాత అనిల్ సుంకర కు ఓ కథ వినిపించాడట. ‘దీనిని మహేష్ గారితో చేద్దాం’ అని ఆయన చెప్పాడట. ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఇంకో సినిమా చేస్తాను అని మహేష్… నిర్మాత అనిల్ సుంకరకు మాటిచ్చాడట.

పూరి తన స్క్రిప్ట్ తో కనుక మహేష్ ను మెప్పిస్తే.. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం గ్యారెంటీ అని సమాచారం. ప్రస్తుతం మహేష్.. పరశురామ్ డైరెక్షన్లో ‘సర్కారు వారి పాట’ అనే చిత్రం చేస్తున్నాడు. దీని తరువాత త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాలి అనుకున్నాడు. కానీ స్క్రిప్ట్ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు పూరి సీన్లోకి ఎంటరయ్యాడు. మరి ఈ స్క్రిప్ట్ అయినా ఓకే అవుతుందో లేధో చూడాలి..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus