పవన్ పై యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్న త్రివిక్రమ్
- June 19, 2017 / 07:59 AM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మొదటి సినిమా నుంచి ఫైట్స్ కొత్తగా చేస్తుంటారు. కొన్నిచిత్రాలకు స్వయంగా పవన్ కూడా ఫైట్స్ కంపోజ్ చేశారు. అందుకే అతని సినిమాలో యాక్షన్ సీన్స్ స్పెషల్ గా ఉంటాయి. పవన్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అత్తారింటికి దారేదీలోను ఓ వైపు సీరియస్ గా ఫైట్ జరుగుతున్నప్పటికీ మరో వైపు హాస్యం కూడా జనరేట్ అవుతుంటుంది. అలాంటి యాక్షన్ సీన్ పవన్ తాజా చిత్రంలోనూ ఉంది. దానిని ఇప్పుడు సారధి స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్ లో పవన్, కొంతమంది జూనియర్ ఆర్టిస్టులపై త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు.
ఈ నెలాఖరు వరకు ఈ యాక్షన్ సన్నివేశం షూటింగ్ జరుగుతుందని చిత్ర బృందం వెల్లడించింది. హీరోయిన్లుగా కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్న ఈ సినిమాలో యువ నటుడు ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నారు. అలాగే కీలక పాత్రలో సీనియర్ నటి కుష్బూ కనిపించనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ వందకోట్ల బడ్జెట్ తో తో నిర్మిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ లో థియేటర్లోకి రానున్నట్లు సమాచారం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















