Trivikram, Mahesh Babu: మహేష్ కోసం త్రివిక్రమ్ భారీ సెట్!

  • April 8, 2022 / 06:03 PM IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ‘అల.. వైకుంఠపురములో’ సినిమా తరువాత ఇప్పటివరకు మరో సినిమాను మొదలుపెట్టలేదు. మధ్యలో ‘భీమ్లానాయక్’ సినిమాకు మాటలు-స్క్రీన్ ప్లే అందించారు. త్వరలోనే త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. షూటింగ్ లో భాగంగా త్రివిక్రమ్ ఓ భారీ సెట్ ను నిర్మించబోతున్నారు. హైదరాబాద్ నగర శివార్లలో దాదాపు ఎనిమిది ఎకరాల్లో మాసివ్ సెట్ ను నిర్మించబోతున్నారు.

ఇదొక కాలనీ సెట్ అని తెలుస్తోంది. సినిమాలో ఎక్కువ భాగం ఈ కాలనీ సెట్ లోనే చిత్రీకరించబోతున్నారు. అందుకే ఎంతో లావిష్ గా ఈ సెట్ ను నిర్మిస్తున్నారని తెలుస్తోంది. జూన్ నెల నుంచి మహేష్ బాబు ఈ సెట్ లో జాయిన్ కానున్నారు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చిత్రీకరించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

తమన్ సంగీతం అందించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన త్రివిక్రమ్ ప్రస్తుతం నటీనటులను ఎన్నుకునే పనిలో పడ్డాడు. పేరున్న ఆర్టిస్ట్ లను ఈ సినిమా కోసం ఎన్నుకుంటున్నారు. ఇక మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నారు. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఫైనల్ గా మే 12న ప్రేక్షకుల ముందుకు రానునట్లు దర్శకనిర్మాతలు అనౌన్స్ చేశారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus