Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అచ్చమైన తెలుగు కథకు నిలువెత్తు రూపం త్రివిక్రమ్!

అచ్చమైన తెలుగు కథకు నిలువెత్తు రూపం త్రివిక్రమ్!

  • November 5, 2016 / 01:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అచ్చమైన తెలుగు కథకు నిలువెత్తు రూపం త్రివిక్రమ్!

సినిమాల్లో ప్రధానంగా రెండు రకాలు. ఒకటి విలువలు పాటించేవి.. మరొకటి డబ్బులు కురిపించేవి. మొదటి దాటికి ఆర్ట్ ఫిలిమ్స్ అని ముద్ర వేస్తే, రెండోదానికి కమర్షియల్ మూవీలంటూ పేరు పెట్టారు. ఈ రెండింటిని మిక్స్ చేసి సినిమాలు తీసి విజయవంతమయిన అతితక్కువమందిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. రచయితగా పరిశ్రమలోకి అడుగుపెట్టి మాటలతో మాయ చేసి మాటల మాంత్రికుడిగా బిరుదు అందుకున్నారు. డైరక్టర్ గా కుటుంబ సమేతంగా చూసే చిత్రాలను తెరకెక్కించి టాలీవుడ్ లో టాప్ డైరక్టర్ గా నిలబడ్డారు. తెలుగుదనం నిండిన చిత్రాలు తీసే ఈ మాంత్రికుడు నేడు (నవంబర్ 7) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయనకు ఫిల్మ్ ఫోకస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ స్పెషల్ ఆర్టికల్..

1. నువ్వే నువ్వేnuvve-nuvve“జీవితంలో ధనం కన్నా విలువైనది ఎన్నో ఉన్నాయి” అనే థీమ్ తో త్రివిక్రమ్ రాసిన కథ నువ్వే నువ్వే. తొలి సారి దర్శకత్వం వహిస్తున్నాననే టెన్షన్ లేకుండా చక్కగా తీశారు. పొడి మాటలతో పంచ్ లు వేసే మాటల మాంత్రికుడు ఇందులో బరువైన మాటలు రాసి ఉత్తమ మాటల రచయితగా నంది అవార్డు అందుకున్నారు.

2. అతడుathadu“ప్రేమ, అభిమానం అనేవి హంతకుడిని సైతం మామూలు మనిషిని చేస్తాయి” అనే ఐడియాతో రూపొందిన చిత్రం అతడు. ఈ మూవీ ద్వారా ఉమ్మడి కుటుంబం లోని అనుబంధాలను నేటి యువతకు చాలా తాజాగా చూపించారు.

3. జల్సాjalsaయుద్ధంలో గెలవడం అంటే ఓడించడం.. చంపడం కాదు అనే సిద్ధాంతాన్ని.. చక్కని ప్రేమకథతో జోడించి త్రివిక్రమ్ తీసిన చిత్రం జల్సా. ఇందులో అన్యాయాన్ని ఆపడానికి రక్తపాతమే అవసరం లేదని చూపించారు.

4. ఖలేజాkalejaమంచి మనసున్న ప్రతి ఒక్కడూ దేవుడే… అనే మంచి వాఖ్యాన్ని ఆధారం చేసుకుని మాటల మాంత్రికుడు డెవలప్ చేసిన స్టోరీ ఖలేజా. ఒక మంచి కార్యం చేయడానికి పంచభూతాలు మనకి సహకరిస్తాయని మన పెద్దవాళ్లు చెప్పిన సంగతి ఈ మూవీ చూస్తున్నప్పుడు అందరికీ గుర్తుకువస్తుంది.

5. జులాయిjulayiదురాశ దుఃఖానికి చేటు అనే తెలుగు సామెతను థీమ్ గా చేసుకొని కథను అల్లుకున్న సినిమా జులాయి. చిన్నప్పుడు తెలుగు పుస్తకాల్లోని సామెతలను అర్ధం చేసుకుంటే అందులోంచి ఎన్నో కథలు తయారు చేయవచ్చని ఈ ఫిల్మ్ ద్వారా త్రివిక్రమ్ నిరూపించారు.

6. అత్తారింటికి దారేదిattarintiki-daredhiమనిషి బతకడానికి డబ్బు అవసరమవుతుందేమో గాని.. సంతోషంగా జీవించడానికి డబ్బు మాత్రమే సరిపోదు. ప్రేమను పంచడానికి, పుచ్చుకోవడానికి మనకంటూ కొంతమంది ఆత్మీయులు కావాలి. అత్తారింటికి దారేది సినిమాల్లో దాగున్న రహస్యమిదే. ఈ చూసిన తర్వాత అందరి మనసులో మదిలో మెదిలో మాట “కలిసి ఉంటే కలదు సుఖం”.

7. సన్నాఫ్ సత్యమూర్తిson-of-satyamurthyమనిషి చచ్చిపోయినా మాట చావదు అంటుంటారు.. తండ్రి ఇచ్చిన మాటను కొడుకులు కట్టుబడి ఉండడం తెలుగు వారికి అలవాటు. ఆస్తుల కోసం తండ్రి కొడుకులు కొట్టుకునే ఈ కాలంలో నాన్న విలువలనే ఆస్తిగా భావించేవారు కూడా ఉంటారు. అదే టాపిక్ తో తెరకెక్కిన చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి.

8. అ..ఆA Aaగ్రామాల్లో ఇప్పటికీ పరువు, ప్రతిష్ట కోసం ప్రాణాలు ఇచ్చే వారున్నారు. అటువంటి కుటుంబాలలో జరిగే సంఘటనల కలయికే అ..ఆ మూవీ కథ. యద్దనపూడి సులోచన రాణి దశబ్దాల క్రితం రాసిన మీనా కథ ఆధారంగా తెరకెక్కిన ఇందులోనూ కుటుంబ విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

కమర్షియల్ కథ అనగానే నాలుగు ఐదు విదేశీ చిత్రాలను చూసి, దానికి కొన్ని యాక్షన్ సీన్లు, ఐటెం సాంగులు జతచేసే కొంత మంది డైరెక్టర్లకు భిన్నంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మన ఇళ్లల్లో జరిగే సంఘటనలకు కమర్షియల్ స్టేటస్ తీసుకొచ్చారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #a.aa.. movie
  • #Athadu Movie
  • #Attarintiki Daredhi Movie
  • #Director Trivikram
  • #jalsa movie

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 hour ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

22 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

22 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

10 mins ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

53 mins ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 hour ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

2 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version