అల వైకుంఠపురములో చిత్రంతో ఓ భారీ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుని సూపర్ ఫామ్లో ఉన్నాడు త్రివిక్రమ్. తన తర్వాతి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే మధ్యలో పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్లో సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమాకి రైటర్ గా కూడా పనిచేస్తున్నాడు.పవన్ కళ్యాణ్ … త్రివిక్రమ్ కు అత్యంత సన్నిహితుడు, అలాగే హారిక & హాసిని, సితార ఎంటర్టైన్మెంట్స్ …
సంస్థలు త్రివిక్రమ్ కు హోమ్ బ్యానర్లు వంటివి అందుకే భీమ్లా నాయక్ కు త్రివిక్రమ్ రచయితగా పనిచేయడానికి ఒప్పుకున్నాడు. అయితే రైటర్ గా పనిచేస్తున్నప్పటికీ త్రివిక్రమ్ భారీగానే పారితోషికం అందుకుంటున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం.. త్రివిక్రమ్ ఈ మూవీ కోసం ఏకంగా రూ.15 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడట. అంతేకాదు సినిమాకి వచ్చిన బిజినెస్ లో ఏకంగా అతనికి 60 శాతం వాటా కూడా దక్కుతుందని తెలుస్తుంది. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల బ్రాండ్ వల్లనే ఎక్కువ బిజినెస్ జరుగుతుంది.
అందుకే దర్శకుడు సాగర్ చంద్ర కంటే కూడా త్రివిక్రమ్ కే ఎక్కువ పారితోషికం దక్కుతుంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా కోసం ఏకంగా రూ.50 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి.
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?