ప్రతి హీరోయిన్ తోనూ నాకు లింక్ పెట్టారు!

  • May 27, 2018 / 10:25 AM IST

“అజ్ణాతవాసి” సినిమా తెలుగు చిత్రసీమలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది, డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోయారు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే.. అప్పట్లో పవన్ కళ్యాణ్ డబ్బులు వెనక్కి ఇవ్వడానికి ఇష్టపడలేదని, పాపం డైరెక్టర్ త్రివిక్రమ్ & ప్రొడ్యూసర్ చినబాబు ఆ నష్టాల్ని సర్దారని వార్తలొచ్చాయి. దాంతో చాలామంది పవన్ కళ్యాణ్ మరీ ఇంత చీప్ గా ఆలోచిస్తాడా అనుకొన్నారు. కానీ.. ఇవాళ ఈనాడు దినపత్రికకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఆశ్చర్యానికి గురి చేయడంతోపాటు.. త్రివిక్రమ్ మీద ఉన్న గౌరవం, పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానం రెట్టింపయ్యేలా చేసాయి.

ముందుగా “అజ్ణాతవాసి నష్టాల గురించి చెబుతూ.. “”అజ్ఞాతవాసి” సినిమా తర్వాత డిస్ట్రిబ్యూటర్లకి నష్టాలొచ్చాయ్. 90కోట్లకి కొన్నారు, 60 వచ్చింది. అంటే 30కోట్లు సర్థాలనమాట. నేనూ, కళ్యాణ్ గారూ, నిర్మాత కలిసి 25కోట్లు సర్దుబాటు చేశాం. సినిమా విడుదలైన వారం రోజులకు ఎవరి డబ్బులు వాళ్ళకు ఇచ్చేశాం. కళ్యాణ్ వ్యక్తిగతంగా చాలా మంచోడు. ఇంకొకడిది ఆశించడు. ఎదుటివాళ్ళ కడుపుకొట్టి సంపాదించడం ఎందుకు అనే మనస్తత్వం ఆయనది” అంటూ సమాధానమిచ్చిన త్రివిక్రమ్ రచయితగా ఆయన కెరీర్ & పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న రూమర్ల గురించి మాట్లాడుతూ.. “”జల్సా” అనంతరం నేను వర్క్ చేసిన ప్రతి హీరోయిన్ తోనూ నాకు లింక్ పెట్టారు, ఆ వార్తలను నేను ఎప్పుడు పట్టించుకోలేదు, పట్టించుకోను కూడా. అందుకే అవి గాలివార్తల్లా కొట్టుకోపోయాయి.

ఇక ఒక రచయితగా నేను కొత్తగా రాయలేకపోతున్నవాళ్లందరికీ ఒకటే సమాధానం.. కొన్నాళ్ళ తర్వాత “అజ్ణాతవాసి సినిమా అంత పెద్ద ఫ్లాప్ అవ్వాల్సిన సినిమా కాదు అంటారు, “ఖలేజా” విషయంలోనూ ఇదే జరిగింది. కొన్నిసార్లు టైమ్ మన జాతకాన్ని మారుస్తుంది” అంటూ తనదైన శైలిలో స్పందించారు త్రివిక్రమ్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus