Trivikram: ఆ సీన్ తో ప్రేక్షకులను మాయ చేయబోతున్న త్రివిక్రమ్.. ఏమైందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండగా మరో రెండు వారాల్లో పవన్ నటించిన బ్రో మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారో లేదో అనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది. 2023 సంవత్సరంలో బిగ్గెస్ట్ హిట్ గా బ్రో మూవీ నిలిచే ఛాన్స్ అయితే ఉందని పవన్ కళ్యాణ్ అభిమానులు భావిస్తుండటం గమనార్హం. బ్రో సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించడంతో ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, కథనం ఉంటాయని తెలుస్తోంది.

పవన్ త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమాలో క్లైమాక్స్ అద్భుతంగా ఉందనే సంగతి తెలిసిందే. అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ గా నిలవడంలో క్లైమాక్స్ కీలక పాత్ర పోషించింది. బ్రో సినిమాలో కూడా క్లైమాక్స్ కూడా ఎమోషనల్ గా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ లో త్రివిక్రమ్ మార్క్ ఉంటుందని భోగట్టా. బ్రో మూవీ ప్రమోషన్స్ లో మరింత వేగం పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అయితే ఈ సినిమా నుంచి అఖండ రేంజ్ బీజీఎంను ఊహించవద్దని థమన్ ఇప్పటికే ఇంటర్వ్యూలలో చెబుతున్నారు. బ్రో మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. బ్రో ట్రైలర్ వ్యూస్ విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాలి. విరూపాక్ష సక్సెస్ తో సాయితేజ్ మార్కెట్ కూడా అంచనాలను మించి పెరిగింది. బ్రో కూడా సక్సెస్ సాధిస్తే సాయితేజ్ మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

బ్రో మూవీకి సాయితేజ్ రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. బ్రో తర్వాత సాయితేజ్ ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. పవన్, సాయితేజ్ ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటారేమో చూడాలి.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus