ఆ మధ్య ఎప్పుడో త్రివిక్రమ్ చెప్పినట్లు… ‘చార్మినార్ ఇరుకు సందుల్లో పోర్సియో కారు నడుసుతున్నట్లు…’ ఆ డైలాగ్ గుర్తుందా? ఆఁ గుర్తుండే ఉంటాది లెండి మొత్తం సోషల్ మీడియాలో ఆ వీడియో ఇప్పటికీ రన్ అవుతోంది కదా. అలా ఇరుకు సందుల్లో దూరి త్రివిక్రమ్ ఓ సినిమా చేయబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం పవన్ సినిమాల లైనప్‌ను చార్మినార్ ఇరుకు సందులు అనుకుంటే, ఆ మధ్యలోకి త్రివిక్రమ్ రాబోతున్నారట.
పవన్ కల్యాణ్ చేతిలో ఇప్పుడు రెండు సినిమాలున్నాయి. ఇంకో రెండు సినిమాలు ఒప్పుకున్నారు. అయితే ఈ వరుసలోకి త్రివిక్రమ్ వచ్చి చేరుతారని అంటున్నారు. మహేష్‌బాబు చేస్తున్న సినిమా అయిపోగానే త్రివిక్రమ్… పవన్ సినిమా పనులు మొదలుపెడతారట. అయితే పవన్ చేస్తున్న నాలుగు సినిమాలు అయిపోయాక చేస్తారా? లేదా ఉన్న లైనప్‌ను మార్చి… మధ్యలోకి వచ్చి చేస్తారా అనేది తెలియడం లేదు.
ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న సినిమా చూస్తే ‘అయ్యప్పనుమ్ కొషియమ్’ రీమేక్, ‘హరి హర వీరమల్లు’, హరీశ్ శంకర్ – మైత్రీ మూవీ మేకర్స్ సినిమా, సురేందర్ రెడ్డి – రామ్ తాళ్లూరి సినిమా ఉన్నాయి. ఇవయ్యాక జేబీ ఎంటర్‌టైన్మెంట్స్‌కి ఓ సినిమా చేయాలి పవన్. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకుడు అని ఈ మధ్య వార్తలొచ్చాయి. మరిప్పుడు త్రివిక్రమ్ వస్తున్నారు అంటే… కచ్చితంగా అది హారిక హాసిని క్రియేషన్స్‌లో ఉంటుంది. కాబట్టి పవన్ లైనప్ ఏమవుతుందో చూడాలి.