Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) ఇటీవల హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మార్చి, బాలీవుడ్‌పై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఆమె టాలీవుడ్‌కు దూరమవుతుందనే అనుమానాలు రాగా, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram)   ఆమెను తెలుగు సినిమాల్లో చురుకుగా ఉండాలని, అప్పుడప్పుడు హైదరాబాద్‌కు వచ్చి సినిమాలు చేయాలని సూచించారు. ఈ సందర్భంలో సమంత ఇటీవల ‘శుభం’(Subham) ఈవెంట్‌లో మాట్లాడుతూ, తెలుగు సినిమాలు మళ్లీ చేస్తానని, సరైన కథలు దొరక్కపోవడమే ఆలస్యానికి కారణమని, శక్తివంతమైన లేడీ ఓరియెంటెడ్ కథలపై ఆసక్తి ఉందని చెప్పింది.

Trivikram

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. సమంత కోసం త్రివిక్రమ్ ఒక లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఇప్పటివరకు త్రివిక్రమ్ హీరో-సెంట్రిక్ కథలతో సినిమాలు తీసినప్పటికీ, సమంత కోరిక మేరకు మొదటిసారి లేడీ ఓరియెంటెడ్ కథను రాస్తున్నారని టాక్. ఈ సినిమా సమంత కెరీర్‌లో మరో డిఫరెంట్ సినిమాగా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు. త్రివిక్రమ్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. అల్లు అర్జున్‌తో (Allu Arjun) సినిమా అనుకున్నప్పటికీ, ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది.

దీంతో వెంకటేష్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు, దీనికి స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది, వెంకటేష్ కాల్‌షీట్స్ దొరికిన వెంటనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ గ్యాప్‌లోనే సమంత కోసం లేడీ ఓరియెంటెడ్ కథపై పని మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ సినిమా 2026లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. సమంత, త్రివిక్రమ్ కాంబినేషన్ గతంలో ‘అత్తారింటికి దారేది’ (Atharintiki Daaredi), ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (S/O Satyamurthy), ‘అ ఆ’ (A AA) సినిమాలతో మంచి విజయాలు సాధించింది. ఈ మూడు చిత్రాలు సమంత నటనకు మంచి గుర్తింపును తెచ్చాయి, అభిమానుల మనసులో నిలిచాయి.

ఇప్పుడు మళ్లీ ఈ జోడీ కలిసి లేడీ ఓరియెంటెడ్ కథతో రావడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సమంత కెరీర్‌లో శక్తివంతమైన పాత్రలతో మరో హిట్ అందుకోవడానికి ఈ సినిమా ఒక అవకాశంగా మారనుందని అంటున్నారు. సమంత తెలుగు సినిమాల్లో మళ్లీ సందడి చేయడానికి సిద్ధంగా ఉందని, త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఆమె అంచనాలకు తగ్గట్టుగా ఉంటే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు. మరి సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది, ఎలాంటి కథతో వస్తుందో చూడాలి.

అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus