Rashmika Mandanna: రష్మిక చేసిన పనికి ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు!

నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక. ఇప్పుడు ఈ బ్యూటీ తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటిస్తోంది. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారింది. ‘పుష్ప’ కంటే ముందుగానే రష్మిక హిందీలో రెండు, మూడు సినిమాలు ఓకే చేసింది. కరోనా లేకపోయివుంటే ఈపాటికే రష్మిక బాలీవుడ్ డెబ్యూ జరిగేది. ‘పుష్ప’ హిందీ డబ్బింగ్ తో రష్మికకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. నార్త్ ప్రేక్షకులు రష్మికపై ప్రశంసలు కురిపించారు.

మొత్తానికి రష్మికకు ‘పుష్ప’ సినిమాతో మంచి ఫాలోయింగ్ పెరిగింది. దీంతో ఆమె చేసినా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ ట్రోలింగ్ కి గురైంది. ఆమె అందంగా ఉన్నప్పటికీ.. అందమైన మనసు లేదంటూ జనాలు మండిపడుతున్నారు. దీనికి కారణమేమిటంటే.. నిన్న రష్మిక మందన ముంబైకి వెళ్లింది. అక్కడ ఓ హోటల్ నుంచి బయటకు రాగానే.. ఓ చిన్నారి వచ్చి రష్మికను అడుక్కోవడం మొదలుపెట్టింది.

అలా పాప రావడంతోనే రష్మిక సెక్యూరిటీ గార్డులు పక్కకు జరిపారు. అయినా కూడా ఆ పాప రష్మికను ప్రాధేయ పడుతుంది. ఆకలేస్తుంది.. ఏమైనా ఉంటే ఇవ్వండి అంటూ అడిగింది. కానీ రష్మిక మాత్రం నవ్వుతూనే కారు ఎక్కి వెళ్లిపోయింది. ఈ విషయం మీద నెటిజన్లు రష్మికపై ఫైర్ అవుతున్నారు. ఆ చిన్నారి అంతలా అడుగుతుంటే ఏమైనా సాయం చేయొచ్చు కదా అంటూ రష్మికపై కామెంట్స్ చేస్తున్నారు. ఆ పాప అలా అడుక్కుంటుంటే.. నువ్ ఎలా నవ్వగలుగుతున్నావ్ అంటూ రష్మికను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నాడు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus