‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) మూవీతో వెంకీ అట్లూరి (Venky Atluri) మరో హిట్టు కొట్టేశాడు. ‘సార్’ (Sir) మూవీ ధనుష్ (Dhanush) తో చేయగా, ‘లక్కీ భాస్కర్’ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తో చేసి హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఈ ఇద్దరు కూడా తెలుగు హీరోలు కాకపోవడం గమనార్హం. వెంకీ అట్లూరి మొదటి సినిమాని వరుణ్ తేజ్ (Varun Tej) తో చేశాడు. ‘తొలిప్రేమ’ (Tholi Prema) అంటూ రొమాంటిక్ లవ్ స్టోరీని మొదటి చిత్రంగా తెరపై ఆవిష్కరించాడు. రెండో సినిమాగా ‘మిస్టర్ మజ్ను’ (Mr. Majnu) చేశాడు. ఈ మూవీ కూడా రొమాంటిక్ లవ్ స్టోరీగానే తెరకెక్కింది.
Venky Atluri
అనంతరం నితిన్ (Nithin Kumar) తో ‘రంగ్ దే’ (Rang De) అనే సినిమా చేశాడు. మొదటి మూడు సినిమాలకి ఒకే తరహా కథలని తీసుకున్న వెంకీ అట్లూరి ఇతర భాష హీరోలతో చేసినపుడు మాత్రం డిఫరెంట్ స్టోరీస్ తెరపై ఆవిష్కరించాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో అతనిపై ట్రోలింగ్ నడుస్తోంది. వెంకీ అట్లూరి అఖిల్ (Akhil) , నితిన్ లకి రొటీన్ కథలతో ఫ్లాప్ లు ఇచ్చి ధనుష్, దుల్కర్ కి మాత్రం కాంటెంపరరీ లైన్స్ తో సూపర్ హిట్స్ ఇచ్చాడని అంటున్నారు.
తెలుగు హీరోలతో ఆ కథలు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. వెంకీ అట్లూరికి టాలీవుడ్ హీరోలపై చిన్న చూపు ఉందని విమర్శలు చేస్తున్నారు. అక్కినేని, నితిన్ ఫ్యాన్స్ వెంకీ అట్లూరి మీద సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వెంకీ అట్లూరిని విమర్శించడం కరెక్ట్ కాదని సినీ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి ‘సార్’ మూవీ కథని వెంకీ అట్లూరి ముందుగా నాగచైతన్యకి (Naga Chaitanya) చెబితే అతను రిజక్ట్ చేసాడని టాక్ వస్తోంది.
అదే కథతో ధనుష్ కి వెంకీ సూపర్ హిట్ ఇచ్చాడని చెబుతున్నారు. అలాగే ‘లక్కీ భాస్కర్’ సినిమా కథని కూడా వెంకీ నానిని దృష్టిలో పెట్టుకొని రాసాడని, అతనికి నేరేషన్ కూడా ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. ‘జెర్సీ’ (Jersey) , ‘హాయ్ నాన్న’ (Hi Nanna) సినిమాల తర్వాత మరోసారి తండ్రి పాత్రలో నటించడానికి ఇష్టం లేక నాని (Nani) ఈ ప్రాజెక్ట్ వదులుకున్నాడని అంటున్నారు. దీంతో వెంకీ అదే కథని దుల్కర్ కి చెప్పి ఇప్పుడు సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాల విషయంలో వెంకీని అస్సలు నిందించడానికి లేదని చెబుతున్నారు.