Sree Vishnu: కుర్ర హీరోపై ఘాటు విమర్శలు!

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా ఎదిగాడు శ్రీవిష్ణు. ఇప్పటివరకు తన కెరీర్ లో ఎలాంటి వివాదాల జోలికి వెళ్లలేదు శ్రీవిష్ణు. సైలెంట్ గా సినిమాల్లో నటిస్తూ.. వాటిని రిలీజ్ చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇప్పుడో సినిమా కారణంగా శ్రీవిష్ణుని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఆయన నటించిన సినిమా ‘అర్జున ఫాల్గుణ’ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు.

ఇందులో గ్రామవాలంటీర్ ప్రస్తావన ఉంది. హీరోయిన్ ను ఏ ఉద్యోగం వచ్చిందని అడుగుతాడు హీరో ఫ్రెండ్. దానికి ఆమె ‘గ్రామ వాలంటీర్’ అని గర్వంగా చెబుతుంది. ఆ మాట విన్న శ్రీవిష్ణు.. ‘ఇంటింటికీ వెళ్లి కోటా సరుకులిస్తారు అదేనా..?’ అని వెటకారంగా అడుగుతాడు. ఈ డైలాగే ఇప్పుడు అతడిని ఇబ్బందుల్లోకి నెట్టేసింది.

గ్రామవాలంటీర్ అంటే అంత చీప్ గా కనిపిస్తున్నారా..? అంటూ శ్రీవిష్ణుని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నాడు. కరోనా సమయంలో గ్రామ వాలంటీర్లు చేసిన సేవలను శ్రీవిష్ణుకి గుర్తుచేస్తున్నారు నీతిజ్ఞలు. కొంతమంది రియల్ లైఫ్ లో ఉదాహరణలను షేర్ చేస్తుంటే.. మరికొందరేమో పేపర్ కటింగ్స్ ను పోస్ట్ చేస్తూ శ్రీవిష్ణుని ట్యాగ్ చేస్తున్నారు.

దీంతో శ్రీవిష్ణు ఇరకాటంలో పడినట్లయింది. ట్రైలర్ లో ఆ విజువల్స్ కాస్త వివాదాస్పదంగా అనిపించినప్పటికీ.. సినిమాలో గ్రామవాలంటీర్ ఎపిసోడ్ అంతా పాజిటివ్ గానే ఉంటుందని.. దాన్ని మంచి ఉద్యోగంగానే చెప్పామని అంటున్నారు మేకర్లు. ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందేమో చూడాలి!

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus