Prabhas: గ్లింప్స్ రాకుండానే ట్రోల్స్ ఎందుకు.. ప్రతిదీ ట్రోల్ చేస్తే ఎలా అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోల రేసులో ప్రభాస్ ఉన్నారనే సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమాలకు 500 కోట్ల రూపాయల నుంచి 600 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది. ప్రభాస్ కు బాలీవుడ్ లో కూడా భారీ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సైతం రికార్డులు సృష్టిస్తాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. సాధారణంగా ప్రభాస్ వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.

అయితే ప్రభాస్ (Prabhas) సినిమాలు మాత్రం విడుదలకు ముందు, విడుదల తర్వాత వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. 500 నుంచి 700 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రభాస్ సినిమాలు తెరకెక్కుతున్నా ఈ సినిమాలు వివాదాల్లో చిక్కుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. ప్రాజెక్ట్ కే మూవీ పోస్టర్ గురించి ట్రోల్స్, మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.

ప్రాజెక్ట్ కే గ్లింప్స్ కూడా రాకుండానే ట్రోల్స్ ఎందుకని ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతున్నారు. మహానటి సినిమాలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా ప్రకటించిన సమయంలో కూడా నాగ్ అశ్విన్ పై ఇదే విధంగా ట్రోల్స్ వచ్చాయి. నాగ్ అశ్విన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. ఈ సినిమాతో పాన్ వరల్డ్ డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం.

వైజయంతీ మూవీస్ బ్యానర్ ఊహించని స్థాయిలో ఈ సినిమా కోసం ఖర్చు చేస్తుండటం గమనార్హం. ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది. 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా మామూలుగా ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్ట్ కే మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ అంటే గిట్టనివాళ్లు, ప్రభాస్ ఎదుగుదలను ఓర్వలేని వాళ్లు ఆయనను ట్రోల్ చేయిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus