Sita Ramam Movie: టెలివిజన్ ప్రీమియర్ గా భారీ రేటింగ్ సొంతం చేసుకున్న సీతారామం!

హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ స్వప్న దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం సీతారామం. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా హిందీ భాషలో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అద్భుతమైన ప్రేమ కథ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు.

ఇలా ఆగస్టు 5వ తేదీ స్పెషల్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా దాదాపు 80 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ సినిమా థియేటర్లను పూర్తి చేసుకున్న అనంతరం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమైంది.ఇక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి ఈ చిత్రం తాజాగా స్టార్ మా లో టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైన సంగతి తెలిసిందే.

ఇకపోతే టెలివిజన్ ప్రీమియర్ గా సీతారామం సినిమా ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం అయినటువంటి ఈ సినిమా ఏకంగా 8.73 రేటింగ్ కైవసం చేసుకుంది. ఈ సినిమా ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ (8.25) కన్నా అద్భుతమైన రేటింగ్ కైవసం చేసుకోవడం విశేషం. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ తో పాటు కీలక పాత్రలో రష్మిక మందన్న, తరుణ్ భాస్కర్ వంటి స్టార్ సెలబ్రిటీలు కూడా నటించి సందడి చేశారు.

కేవలం ఇండియాలోనే కాకుండా యూఎస్ లో కూడా ఈ సినిమా తెలుగు వెర్షన్ ఏకంగా వన్ మిలియన్ డాలర్ వసూలు చేసే సరికొత్త రికార్డు సృష్టించింది.ఈ విధంగా థియేటర్లోనూ ఓటీటీలోనూ అలాగే టెలివిజన్ ప్రీమియర్ గా సీతారామం సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus