థియేటర్లలో సక్సెస్ అయిన ప్రతి సినిమా బుల్లితెరపై సక్సెస్ కావాలని లేదు. మహేష్ బాబు నటించిన అతడు, ఖలేజా సినిమాలు థియేటర్లలో ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా బుల్లితెరపై మాత్రం బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. తాజాగా బుల్లితెరపై చరణ్ వినయ విధేయ రామ, బన్నీ అల వైకుంఠపురములో సినిమాలు పోటీ పడ్డాయి. అల వైకుంఠపురములో థియేటర్లలో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
తొలిసారి టీవీలో ప్రసారమైన సమయంలో అల వైకుంఠపురములో సినిమా రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది. అయితే నాలుగోసారి టెలీకాస్ట్ లో మాత్రం ఈ సినిమాకు కేవలం 4.98 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. మరోవైపు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 19వ సారి టీవీలో ప్రసారం కాగా 4.96 టీఆర్పీ రేటింగ్ వచ్చింది.
బన్నీ ఇండస్ట్రీ హిట్ సినిమా, చరణ్ డిజాస్టర్ సినిమా ఒకే స్థాయిలో రేటింగ్స్ ను సాధించడం గమనార్హం. ఒక రకంగా బన్నీ కంటే చరణ్ పై చేయి సాధించారనే చెప్పాలి. చరణ్ ఫ్లాప్ సినిమాలకు కూడా ప్రేక్షకుల్లో భారీగా క్రేజ్ ఉండటం గమనార్హం. వాస్తవానికి బుల్లితెరపై త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు ఎన్నిసార్లు ప్రసారమైనా మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటాయి. అయితే అల వైకుంఠపురములో సినిమాకు మాత్రం రిపీట్ టెలీకాస్ట్ లో మంచి రేటింగ్స్ రావడం లేదు.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!