Nanda Kishore: బిగ్ బాస్ సిరి తో గొడవ పై స్పందించిన నటుడు!

నందకిషోర్ పరిచయం అవసరం లేని పేరు ఎన్నో బుల్లితెర సీరియల్స్ లో హీరోగా నటించిన మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ప్రస్తుతం వరుస బుల్లి తెర సీరియల్స్ ద్వారా ఎంతో బిజీగా ఉన్నారు . నందకిషోర్ నటించిన స్రవంతి సీరియల్ మాత్రం ఈయనకు మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించిందని చెప్పాలి. ఇప్పటికీ పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నో విషయాలను వెల్లడించారు.

ఈయన బుల్లితెరపై సీరియల్స్ చేయడమే కాకుండా వెండితెరపై తానే నిర్మాతగా మారి ఒక సినిమాని నిర్మించిన సంగతి తెలిసిందే. నందకిషోర్ నిర్మాతగా అన్నాచెల్లెల అనుబంధం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం నరసింహపురం. 2021 జూలైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకాదరణ సంపాదించుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా బిగ్ బాస్ నటి సిరి హనుమంత్ నటించారు.

ఇది తన మొదటి సినిమా అని ఎలాంటి సపోర్ట్ లేకుండా ఈ సినిమాని దాదాపు మూడు సంవత్సరాలు పాటు కష్టపడి చేశామని అయితే కరోనా కారణంతో ఈ సినిమా పెద్దగా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయిందని నందకిషోర్ తెలిపారు. ఇక ఈ సినిమా విడుదల చేసినప్పటికీ నాకు ఏకంగా కోటి రూపాయలు అప్పు మిగిలిందని ఈయన తెలిపారు. ఇప్పటికీ నేను ఆ అప్పుకు వడ్డీలు కడుతూనే ఉన్నాను అంటూ కిషోర్ తెలిపారు.

అయితే ఈ సినిమా సమయంలో సిరి హనుమంతుకి తనకు మధ్య గొడవలు జరిగాయి అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఈ విషయం గురించి స్పందిస్తూ ఇది కేవలం అవాస్తవం మాత్రమేనని అయితే సిరి అప్పుడప్పుడే ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకుంటుంది. దాంతో కాస్త ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింది మేమంతా ఇవ్వలేకపోయాము. ఇక వ్యక్తిగతంగా అమ్మాయి చాలా మంచి అమ్మాయి అంటూ (Nanda Kishore) నంద కిషోర్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus