Rupali Ganguly: బుల్లితెర నటి కొన్న బెంజ్ కార్ ధర ఎంతంటే..

సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ కారణంగా సెలబ్రిటీలకు సంబంధించిన విశేషాలు, విషయాలన్నీ తెలుస్తున్నాయి. ఆఫ్‌స్క్రీన్ సెలబ్రిటీల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. స్టార్స్ ఏదైనా వెహికల్ కొన్నా, కొత్త ఇల్లు కట్టుకున్నా ప్రతీ అంశాన్ని షేర్ చేసుకుంటుంటారు. అందుకే వాళ్లను మిలియన్ల మంది ఫాలో చేస్తుంటారు. ఇప్పుడు ఓ బుల్లితెర నటి బెంజ్ కార్ కొన్న న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. రూపాలి గంగూలీ.. హిందీలో పాపులర్ సీరియల్ ఆర్టిస్ట్.. ‘దో ఆంఖే బారహాత్’, ‘అంగారా’ లాంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. తర్వాత టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్’ లో మోనిషా క్యారెక్టర్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ‘బా బహూ ఔర్ బేబీ’, ‘పర్వర్రిష్ – కుచ్ ఖట్టీ కుచ్ మీటీ’ సీరియల్స్‌లోనూ అలరించింది. ప్రస్తుతం స్టార్‌ప్లస్‌లో ప్రసారమవుతున్న ‘అనుపమ’ ధారావాహికలో లీడ్ రోల్ చేస్తోంది.

తాజాగా రూపాలి వైట్ కలర్ లగ్జీరియస్ మెర్సిడెస్ బెంజ్ కారు కొన్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. షోరూమ్‌లోనే భర్త అశ్విన్ వర్మ, కుమారుడు రుద్రాంశ్ వర్మలతో కలిసి కేక్ కట్ చేసింది. ఆ తర్వాత పూజ చేసి.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, తన టీమ్‌తో తీసుకున్న కొన్ని ఫోటోలను వీడియో రూపంలో షేర్ చేసింది. ‘జై మాతాది.. జై మహాకాళ్.. నా కలను నిజం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు’ అంటూ పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమెకు విషెస్ తెలియజేస్తున్నారు.

ఇక రూపాలి కొన్న కార్ కాస్ట్ ఎంత ఉంటుంది?.. బుల్లితెర నటి బెంజ్ కార్ కొందంటే మామూలు విషయం కాదు.. అంటూ నెటిజన్లు రూపాలి కార్ గురించి సెర్చ్ చేశారు. లభించిన వివరాల ప్రకారం ఆమె కొన్న బెంజ్ కార్ ధర సుమారు రూ.90 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. రూపాలి గంగూలీ కార్ కొన్న విషయం మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus