బాపుబొమ్మకు అన్నీ ఉన్నా అదృష్టం లేదా..?

స్టార్ హీరోయిన్ కు కావాల్సిన లక్షణాలు అన్నీ పుష్కలంగా ఉన్నా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కినా హీరోయిన్ గా ప్రణీత తెలుగులో అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారు. పోర్కి సినిమాతో శాండిల్ వుడ్ లో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన ప్రణీత ఏం పిల్లో ఏం పిల్లడో మూవీతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ కాలేదు. ఆ సినిమా తరువాత ప్రణీత సిద్దార్థ్ హీరోగా తెరకెక్కిన బావ సినిమాలో నటించగా ఆ సినిమాతో చేదు ఫలితమే దక్కింది.

అయితే త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ హీరోగా తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమా ప్రణీత కెరీర్ ను మలుపు తిప్పింది. ఆ సినిమా ఫస్ట్ హాఫ్ లో సమంత కంటే ప్రణీతకే ఎక్కువగా స్క్రీన్ ప్రజెన్స్ దక్కింది. అత్తారింటికి దారేది సక్సెస్ వల్ల ప్రణీతకు రభస సినిమాలో ఛాన్స్ దక్కినా ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఆమె కెరీర్ కు పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. అయితే ప్రణీతకు కొన్ని నెలల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్లు వచ్చాయి.

బాలీవుడ్ లో హంగామా 2, భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాల్లో ప్రణీత నటించగా థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాలు కరోనా సెకండ్ వేవ్ వల్ల ఓటీటీలలో రిలీజ్ కానున్నాయి. ఇలా జరగడంతో పవన్ హీరోయిన్ కు రెండు షాకులు తగిలాయి. బాపుబొమ్మకు అన్నీ ఉన్నా అదృష్టం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓటీటీలలో రిలీజ్ కానున్న ఈ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది. తెలుగు, కన్నడ సినిమాల్లో నటించినా ప్రణీత స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోలేకపోయారు. మరి బాలీవుడ్ లోనైనా ప్రణీత స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus