Trisha: త్రిషకు రెండు క్రేజీ ఆఫర్లు.. మరి ఒప్పుకుంటుందా..?

నటి త్రిషకు రెండు టాలీవుడ్ సినిమాల్లో అవకాశం వచ్చిందని సమాచారం. చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాకి ‘భోళా శంకర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇందులో కీర్తి సురేష్ హీరో చెల్లెలి పాత్రలో కనిపించనుంది. ఇక హీరోయిన్ గా త్రిషను ఖరారు చేయాలని చూస్తున్నారు. కొన్నేళ్ల క్రితం చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. కానీ ఆ సినిమా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.

‘ఆచార్య’ సినిమాలో హీరోయిన్ గా మొదట త్రిషనే తీసుకోవాలనుకున్నారు. కానీ ఆమె లాస్ట్ మినిట్ డ్రాప్ అవ్వడంతో కాజల్ ను ఎంపిక చేసుకున్నారు. అయితే ఈసారి మాత్రం త్రిష ఖాయమైనట్లే అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోపక్క బాలకృష్ణ సినిమాలో కూడా హీరోయిన్ గా త్రిష పేరుని పరిశీలిస్తున్నారు. బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో మొదలుకానున్న ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను సంప్రదిస్తున్నారు.

గతంలో ఈ బ్యూటీ బాలయ్యతో కలిసి ‘లయన్’ సినిమాలో నటించింది. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ మరోసారి త్రిషనే రంగంలోకి దింపాలనుకుంటున్నారు. అయితే త్రిష నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రావాల్సివుంటుంది. మరి త్రిష ఈ రెండిటిలో ఏ సినిమాకి డేట్స్ ఇవ్వబోతుందో చూడాలి!

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus