Prabhas: ప్రభాస్ అభిమానులకు ఇంతకు మించి శుభవార్తలు ఉంటాయా?

  • May 27, 2023 / 10:51 AM IST

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సలార్ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమ బడ్జెట్ కూడా అత్యంత భారీ మొత్తమనే సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు కేవలం 4 నెలల సమయం మాత్రమే ఉంది. ఆదిపురుష్ మూవీ రిలీజ్ రోజునే సలార్ మూవీ టీజర్ సైతం రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఒకేరోజు ప్రభాస్ ఫ్యాన్స్ కు రెండు పండుగలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ అభిమానులకు ఇంతకు మించి శుభవార్తలు ఉంటాయా అని కొంతమంది ఫ్యాన్స్ అభీప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ కాగా ఈ సినిమాలో కేజీఎఫ్ తరహా యాక్షన్ సన్నివేశాలతో పాటు నెక్స్ట్ లెవెల్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రభాస్ కెరీర్ పరంగా ఎదగడంతో పాటు మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ప్రభాస్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ సినిమాకు పారితోషికం తీసుకోగా ఈ సినిమాకు వర్కింగ్ డేస్ కూడా ఎక్కువ కావడం గమనార్హం. ప్రభాస్ ఎంత కష్టపడినా ఆ కష్టానికి పది రెట్ల ఫలితం ఈ సినిమాతో వస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ టాలెంట్ వేరు, ఆయన రేంజ్ వేరు అని బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేసే సత్తా ఈ సినిమాకు మాత్రమే ఉందని మరి కొందరు చెబుతున్నారు.

ప్రభాస్ (Prabhas) పాన్ వరల్డ్ స్టార్ హీరోగా సత్తా చాటడంతో పాటు అభిమానులకు మరింత దగ్గరవుతారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ సినిమాలలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఎక్కువగా ఉండనున్నాయని తెలుస్తోంది. ప్రభాస్ కు కెరీర్ పరంగా మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ ను అభిమానించే అభిమానుల సంఖ్య మరింత పెరుగుతోంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus