డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) గత కొన్ని సినిమాలతో గట్టి ఎదురుదెబ్బలు తిన్నా… తన స్పీడ్ మానలేదు. లైగర్(Liger) , ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) సినిమాలు డిజాస్టర్ అవ్వడం పూరి కెరీర్‌ను ప్రశ్నార్థకంగా మార్చినప్పటికీ, ఆయన మాత్రం తన స్టైల్ మార్చకుండా కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈసారి పూరి కలయికలో చేరుతున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ఇది విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న సినిమా కావడంతో ఆసక్తి ఎక్కువైంది.
ఈ మూవీకి బెగ్గర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కథలో ఓ వింతదనం, నటీనటుల ఎంపికలో పూరి మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. విజయ్ సేతుపతికి జోడీగా రాధిక ఆప్టే (Radhika Apte) నటించనుండగా, టబు (Tabu) ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరిదశకు చేరగా, రెగ్యులర్ షూట్ మే మొదటి వారం నుంచి మొదలవుతుందని సమాచారం. పూరి స్పీడ్‌కి తగ్గట్టుగా ఈ సినిమాను కేవలం 60 రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేశారు.
రెండు షెడ్యూల్స్ వేసుకొని నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరిపి, పోస్ట్ ప్రొడక్షన్ కూడా సమర్థవంతంగా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. గతంలో మహేష్ బాబు (Mahesh Babu) బిజినెస్ మేన్ వంటి చిత్రాలను తక్కువ సమయంలోనే పూర్తి చేసి రికార్డులు నెలకొల్పిన పూరి స్పీడ్ మళ్లీ కనిపించనుందనే అంచనాలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో విజయ్ సేతుపతి కూడా ఇప్పుడు సౌత్‌లో క్రేజ్ ఉన్న యాక్టర్. ఆయన తక్కువ బడ్జెట్ సినిమాలతో హిట్‌లు సాధించడంలో మాస్టర్.
ఈసారి పూరితో కలిసి నటిస్తుండడంతో రెండు ఇండస్ట్రీల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సో, కంటెంట్ క్యాచ్ అయితే.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయం అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ట్రెండ్ మారినప్పటికీ, పూరి జగన్నాథ్‌కు ఇంకా తన ఫాలోయింగ్ ఉందని ఈ ప్రాజెక్ట్ చాటుతోంది. ఈ ఏడాదిలోనే ఈ మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.