Allu Arjun: అల్లు అర్జున్ కోసం ఆ ఇద్దరినీ దింపుతారట..!

నిజానికి `పుష్ష‌’ కి ముందే అల్లు అర్జున్ ‘ఐకాన్’ అనే మూవీ చేయాల్సి ఉంది.వేణు శ్రీరామ్ ఈ ప్రాజెక్టుకి దర్శకుడు కాగా దిల్ రాజు నిర్మించాల్సి ఉంది. కానీ ఆ 2 ఏళ్ళుగా ఆ ప్రాజెక్టు పెండింగ్ లోనే ఉంది. వేణు శ్రీరామ్ స్క్రిప్ట్ పై నమ్మకం లేకపోవడంతో బన్నీ ముందుకు వెళ్ళలేదంటూ కొంతకాలం.. లేదు దిల్ రాజు చెప్పిన పారితోషికం నచ్చక బన్నీ ముందుకు రాలేదంటూ కొంతకాలం ప్రచారం జరిగింది.

అయితే ‘వకీల్ సాబ్’ హిట్ అయ్యాక… మళ్ళీ ‘ఐకాన్’ పై వార్తలు ఎక్కువయ్యాయి. ‘వకీల్ సాబ్’ ప్రమోషన్ల టైములో దర్శకుడు వేణు శ్రీ‌రామ్ కు అలాగే నిర్మాత దిల్ రాజుకి ‘ఐకాన్’ గురించే ఎక్కువ ప్రశ్నలు ఎదురయ్యాయి. వాళ్ళు కచ్చితంగా ఈ ప్రాజెక్టు ఉంటుందని చెప్పడంతో మళ్ళీ ‘ఐకాన్’ పై ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. `పుష్ష` పార్ట్ 1 పూర్తవ్వగానే ‘ఐకాన్’ మొద‌లైపోతుందని బన్నీ వాస్ కూడా చెప్పారు. ఇదిలా ఉండగా… ఈ ప్రాజెక్టులో ఇద్ద‌రు స్టార్ హీరోయిన్లు ఉంటారనేది తాజా స‌మాచారం.

అది కూడా బాలీవుడ్ హీరోయిన్ల‌నే ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవేళ బాలీవుడ్ భామలు వర్కౌట్ కాకపోతే… ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లను రంగంలోకి దింపుతారట.ఈ క్రమంలో ర‌ష్మిక‌, పూజా హెగ్డే, స‌మంత‌ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇది ఒక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ.. అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. హీరోయిన్లకు కూడా సమాన ప్రాధాన్యత ఉంటుందట.పైగా పాన్ ఇండియా ప్రాజెక్టు. అందుకే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus