RRR Movie: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రి రిలీజ్‌కి ఆ స్టార్‌ హీరోలు!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రచారం గురించి, ఆ ప్రమోషన్స్‌ని రాజమౌళి అండ్‌ నిర్వహించే విధానం గురించి చెప్పుకోవడం అంటే… ఎన్ని వార్తలైనా తరగవు. ఎన్ని ప్లాన్స్‌ అయినా సరిపోవు. తాజాగా రాజమౌళి చేస్తున్న మరో ప్రయత్నం తెలిస్తే మీరూ ఇదే మాట అంటారు. ముంబయిలో ఈ సినిమా ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించిన జక్కన్న అండ్‌ కో. ఇప్పుడు టాలీవుడ్‌ ఈవెంట్‌పై కన్నేసింది.బాలీవుడ్‌ ఈవెంట్‌కి మించి తెలుగు ఈవెంట్‌ ఉండాలని చూస్తోంది.

దీని కోసం ఇద్దరు స్టార్‌ హీరోలను తీసుకొస్తున్నట్లు సమాచారం. చాలా రోజుల నుండి ఈ విషయంలో పుకార్లు వినిపిస్తున్నా… ఎక్కడా సరైన సమాచారం రావడం లేదు. అయితే కార్యక్రానికి పక్కా ప్లానింగ్‌ అయితే సాగుతోందట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే… ఈ ఈవెంట్‌కి టాలీవుడ్‌లో టాప్‌ 2 స్టార్లు హాజరవుతారని తెలుస్తోంది. టాలీవుడ్‌ అభిమానులు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న ఫ్రేమ్‌… ఆ స్టార్లు పక్కపక్కన నిలబడితే వచ్చేది. అప్పుడెప్పుడో ఓ ఈవెంట్‌లో ఇలాంటి ఫ్రేమ్‌ చూశారు.

మళ్లీ ఇన్నాళ్లకు దాన్ని సిద్ధం చేయాలని చూస్తున్నారట. అదే చిరంజీవి – బాలకృష్ణ ఉండే ఫ్రేమ్‌. దీని కోసమే ఇప్పుడు ప్రయత్నాలు సాగుతున్నాయట. రామ్‌చరణ్‌ సినిమా కాబట్టి… అందులో డీవీవీ దానయ్య ప్రొడక్షన్‌ కాబట్టి… చిరంజీవి రావడం పెద్ద కష్టం కాదు. అయితే బాలయ్యనే ఒప్పించాలి. ఎన్టీఆర్‌ కోసం బాలయ్య ఈ కార్యక్రమానికి వస్తారా? లేదా? అనేది ఇప్పుడు సోషల్‌ మీడియాలో నడుస్తున్న ప్రచారం. ఒకవేళ వస్తే మాత్రం అద్భుతమే అని చెప్పాలి. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు నలుగురు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అంటే మాటలా.

చిరంజీవి, చరణ్‌ కావాలంటే ఎప్పుడైనా అలా కనిపిస్తారు. అదే తారక్‌, బాలయ్య అంటే చాలా తక్కువ సార్లే ఆ అవకాశం వస్తుంది కదా. తారక్‌, బాలయ్య గతంలో ‘ఎన్టీఆర్‌: కథానాయకుడు’ సినిమా ప్రచారంలో ఇలా ఒకే స్టేజీ మీద కనిపించారు. మళ్లీ ఇప్పుడు ‘ఆర్‌ఆర్ఆర్‌’తో ఆ అవకాశం దొరికేలా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా సంగతి చూస్తే… జనవరి 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. దీని కోసం ‘భీమ్లా నాయక్‌’ సినిమాను ఇటీవల వాయిదా వేసిన విషయం తెలిసిందే.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus