పవన్ కళ్యాణ్ కోసం తయారు చేసిన కథతో యు

కొవెర క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందిన చిత్రం `యు`. శ్రీమ‌తి నాగానిక చాగంరెడ్డి స‌మ‌ర్పించారు. విజ‌య‌ల‌క్ష్మీ కొండా నిర్మాత‌. కొవెర ద‌ర్శ‌కుడు. ఆయ‌నే హీరోగా న‌టించారు. హిమాన్షి కాట్ర‌గ‌డ్డ, స్వప్నా రావ్ నాయిక‌లు . ఈ చిత్రం ఈ నెల 14 న విడుదల కానుంది .

ఈ సందర్భంగా హీరో, ద‌ర్శ‌కుడు కొవెర మాట్లాడుతూ “`యు` టైటిల్‌కి క‌థే హీరో. నేను విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌గారి ద‌గ్గ‌ర నాలుగేళ్లు ప‌నిచేశాను. క‌థా ప‌రంగా ఉన్న అనుభ‌వంతో `యు` రాసుకున్నాను. శుభ‌లేఖ సుధాక‌ర్‌గారు, త‌నికెళ్ల భ‌ర‌ణిగారు క‌థ విన‌గానే చేస్తాన‌ని న‌న్ను ప్రోత్స‌హించారు. ప‌ల్లెటూరిలో మొద‌లై అండర్ వ‌ర‌ల్డ్ లో ఎండ్ అయ్యే క‌థ ఇది. 80 ఏళ్ల సినిమా చ‌రిత్ర‌లో ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని ప్రాజెక్ట్ ఇది. ఈ కథను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నాను. 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీయాల్సిన సినిమా ఇది. కానీ మా దగ్గర అంత బడ్జెట్ లేక కోటి రూపాయలతో తీసాం. ఈ సినిమా మొత్తం హీలియ‌మ్ 8కె కెమెరా తో తీశాం. ఇండియాలో ఇదే తోలి సినిమా “ అని అన్నారు.

శుభ‌లేఖ సుధాక‌ర్ మాట్లాడుతూ “సినిమా చాలా బాగా వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు నా పాత్ర మీద ప్రేమ పెంచుకుని నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి క‌థ చెప్పారు“ అని చెప్పారు.

త‌నికెళ్ల భ‌ర‌ణి మాట్లాడుతూ “సినిమా ప‌రిశ్ర‌మ‌కు ఎన్నో ఆశ‌ల‌తో వ‌చ్చారు కొవెర‌. అత‌నికి మ‌ద్ధ‌తుగా నిలిచిన అత‌ని త‌ల్లికి, భార్య‌కి అభినంద‌న‌లు. నా ద‌గ్గ‌ర‌కు ఈ ప్రాజెక్ట్ ను శుభ‌లేఖ‌ను సుధాక‌ర్ నా ద‌గ్గ‌ర‌కు పంపారు. చాలా ప్రాణం పెట్టి ప‌నిచేశారు. ఈ సినిమాకు ప‌నిచేసిన వారంద‌రూ చాలా బాగా చేశారు. వాళ్ల కృషికి, వాళ్ల త‌ప‌న‌కు సినిమా పెద్ద విజ‌యం కావాలి“ అని అన్నారు.

నిర్మాత విజ‌య‌ల‌క్ష్మీ కొండా మాట్లాడుతూ “ర‌వితేజ ఏదో సినిమాలో అడిగిన‌ట్టు, నా కొడుకు ప్ర‌తిరోజూ న‌న్ను `ఒక్క చాన్స్ అమ్మా` అని అడిగేవాడు. మాకు రామారావు, నాగేశ్వ‌ర‌రావు, చిరంజీవి అంటే ఇష్టం. మా అబ్బాయి కోసం ఈ సినిమా చేశాం. ఈ సినిమా స‌క్సెస్ అవుతుందో లేదో తెలియ‌దు కానీ, మా అబ్బాయి ప‌డ్డ క‌ష్టానికి ఓ గుర్తింపు రావాల‌న్న‌దే నా కోరిక‌. “ అని చెప్పారు.

కెమెరామేన్ మాట్లాడుతూ “కెమెరా క‌న్నా క‌థే ఈ సినిమాకు హీరో. ద‌ర్శ‌కుడితో క‌లిసి నేను చాలా యాడ్స్ చేశా. క‌ల‌రిస్ట్ గా కొన్ని సినిమాలు చేశా. `యు` అనేది టైటిల్ సింగిల్ లెట‌రే, కానీ స్టోరీగా ఆలోచిస్తే చాలా పెద్ద‌గా ఉంటుంది. ఫ‌స్టాఫ్ విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటుంది. సెకండాఫ్‌లో డిఫ‌రెంట్ మూడ్‌లో ఉంటుంది. డిఫ‌రెంట్ మూడ్స్ ఆఫ్ క‌ల‌ర్ కూడా ఉంటుంది“ అని చెప్పారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus