నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో ఈ ఏడాది ‘కోర్ట్’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంతో రామ్ జగదీష్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ‘ఫోక్సో’ చట్టం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో సీనియర్ హీరో శివాజీ విలనిజం హైలెట్ అయ్యింది అని చెప్పాలి. అలాగే సాయి కుమార్ రోల్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది.
ఇక ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ జగదీష్ కు పెద్ద హీరోల నుండి కాల్స్ వస్తున్నాయి. అలాగే ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వంటి బడా సంస్థలు అడ్వాన్స్ లు ఇచ్చి బ్లాక్ చేసినట్టు కూడా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో చాలా సైలెంట్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు రామ్ జగదీష్. ఆగస్టు 17న ఆదివారం నాడు రామ్ జగదీష్ వివాహం జరిగినట్లు స్పష్టమవుతుంది.
రామ్ జగదీష్ వివాహం చేసుకున్న అమ్మాయి పేరు కార్తీక అని తెలుస్తుంది. వీరు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో వైజాగ్లోనే రామ్ జగదీశ్ – కార్తీక..ల వివాహం జరిగినట్లు తెలుస్తుంది. ఇక వీరి వివాహ వేడుకకు ‘కోర్ట్’ సినిమాలో నటించిన నటీనటులు హాజరయ్యారు. విలన్ మంగపతిగా చేసిన శివాజీ.. అలాగే హీరో, హీరోయిన్స్ గా చేసిన రోషన్, శ్రీదేవి వంటి వారు హాజరయ్యి.. సందడి చేశారు. వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.