సంచలన నిర్ణయం తీసుకున్న ఉద‌య్ కిర‌ణ్ హీరోయిన్..!

ఇటీవల ‘నువ్వు నేను’ హీరోయిన్ అనిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తన బిడ్డ ఆలనా పాలనా చూసుకోవడానికి గాను.. ఇక నటనకు గుడ్ బై చెప్పాలని ఈమె డిసైడ్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ… ” ఇప్పుడున్న పరిస్థితుల్లో నా బిడ్డ సంరక్షణ చూసుకోవడం నా బాధ్యత. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇదే సరైన నిర్ణయం అని భావన.ఇదెంత కాలం అంటే.. ఎవరూ కూడా సరైన సమాధానం చెప్పలేం.

ఇలాంటి పరిస్థితుల్లో మన కుటుంబాన్ని క్షేమంగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది.కాబట్టి నేను ఈ స్టెప్ తీసుకుంటున్నాను. ఇక‌ పై నేను సినిమాలకు, సీరియల్స్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. భవిష్యత్తులో సినిమాల్లో, సీరియ‌ల్స్ లో న‌టిస్తానా? లేదా? అనే విషయాన్ని ఆ భగవంతుడు డిసైడ్ చేయాలి. అయితే ప్రస్తుతం నేను పలు కమర్షియల్‌ యాడ్స్‌ కోసం పనిచేస్తున్నాను” అంటూ ఈమె చెప్పుకొచ్చింది. కాగా అనిత తీసుకున్న నిర్ణయం ఆమె అభిమానులను ఒకింత నిరాశకు గురిచేసింది.

2001 వ సంవత్సరంలో ఉద‌య్ కిర‌ణ్ హీరోగా తేజ డైరెక్షన్లో తెరకెక్కిన ‘నువ్వు-నేను’ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. తర్వాత పలు సినిమాల్లో నటించింది కానీ అవేమి విజయం సాధించలేదు. దీంతో ఈమె టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసి బాలీవుడ్ కు వెళ్ళి సెటిల్ అయ్యింది. అక్కడ ఈమె సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈమె నటించిన ‘నాగిని’ తెలుగులో కూడా డబ్ అయ్యి ఇక్కడి ప్రేక్షకులను అలరించింది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Share.