Uday Kiran , Tarun: వైరల్ అవుతున్న ఉదయ్ కిరణ్- తరుణ్.ల రేర్ ఫోటో..!
- November 2, 2024 / 11:01 AM ISTByFilmy Focus
ఉదయ్ కిరణ్ (Uday Kiran) – తరుణ్ (Tarun Kumar) .. ఒకప్పుడు టాలీవుడ్ ను.. ఒక ఊపేసిన స్టార్ హీరోలు. ‘చిత్రం’ ‘నువ్వు నేను’ (Nuvvu Nenu) ‘మనసంతా నువ్వే’ (Manasantha Nuvve) వంటి బ్లాక్ బస్టర్స్ తో ఉదయ్ కిరణ్ స్టార్ హీరో అయితే.., ‘నువ్వే కావాలి’ ‘ప్రియమైన నీకు’ ‘నువ్వు లేక నేను లేను’ ‘నువ్వే నువ్వే’ (Nuvve Nuvve) వంటి సూపర్ హిట్ చిత్రాలతో తరుణ్ స్టార్ హీరో అయ్యాడు. ఓ రకంగా ఈ ఇద్దరి హీరోలకి బ్రేక్ ఇచ్చింది ప్రేమ కథా చిత్రాలే అని చెప్పాలి.
Uday Kiran , Tarun

అయితే తర్వాత మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించి బోర్లా పడ్డారు ఈ స్టార్ హీరోలు. కొన్నాళ్ల తర్వాత ఉదయ్ కిరణ్… ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అతని మరణం వెనుక డైజెస్ట్ చేసుకోలేని విషయాలు చాలా ఉన్నాయి అని దర్శకుడు తేజ (Teja) చెబుతూ ఉంటారు. దీంతో అతని బయోపిక్ తీయమని అభిమానులు కోరితే .. ‘ఉదయ్ కిరణ్ జీవితాన్ని అడ్డంపెట్టుకుని సొమ్ము చేసుకునే స్థితికి నేను రాలేదు’ అంటూ తేజ బదులిచ్చిన సంగతి తెలిసిందే.
మరోపక్క తరుణ్.. కొత్త హీరోలతో పోటీ పడలేక సినిమాలకి దూరమయ్యాడు. ఇదిలా ఉండగా.. ఉదయ్ కిరణ్, తరుణ్..ల వింటేజ్ పిక్ ఒకటి వైరల్ అవుతుంది. హుస్సేన్ సాగర్లో బోట్లో వెళ్తున్న తరుణంలో ఈ ఫోటో తీసుకున్నట్టు స్పష్టమవుతుంది. ఈ ఫోటోకి ఉన్న ఇంకో విశిష్టత ఏమిటంటే ఇందులో.. హీరోయిన్లు సదా (Sadha) , ఆర్తి అగర్వాల్ (Aarthi Agarwal) ..లు కూడా ఉన్నారు.
ఉదయ్ కిరణ్ కి జోడీగా సదా ‘ఔనన్నా కాదన్నా’ అనే సినిమాలో నటించింది. ఇక ఆర్తి అగర్వాల్.. ‘నీ స్నేహంలో’ ఉదయ్ కిరణ్ సరసన నటించింది. ఇక తరుణ్ తో ఆర్తి ‘నువ్వు లేక నేను లేను’ ‘సోగ్గాడు’ (Soggadu) వంటి సినిమాల్లో జోడీగా నటించగా, సదా – తరుణ్ కాంబినేషన్లో సినిమా ఏమీ రాలేదు.













