కన్నడ స్టార్ ఉపేంద్ర (Upendra Rao) నటించిన ‘UI ది మూవీ’ (UI The Movie) 2024 డిసెంబర్ 20న రిలీజ్ అయ్యింది. ఇది కూడా ఉపేంద్ర మార్క్ సెటైరికల్ మూవీ అనే చెప్పాలి. ‘లహరి ఫిల్మ్స్’, ‘జి మనోహరన్’ (Manoharan) & ‘వీనస్ ఎంటర్‌టైనర్స్’ బ్యానర్లపై కెపి శ్రీకాంత్ (Sreekanth K.P.) ఈ చిత్రాన్ని నిర్మించారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్’ సంస్థ రిలీజ్ చేసింది. మొదటి రోజు యావరేజ్ రిపోర్ట్స్ మాత్రమే వచ్చాయి.
UI The Movie Collections:
అయినా కలెక్షన్స్ బాగానే వచ్చాయి. క్రిస్మస్ హాలిడేస్ వల్ల ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఈ సినిమాని బాగానే చూశారు.ఒకసారి (UI The Movie) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘UI’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.1.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.5 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేయాలి. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.1.3 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి పర్వాలేదు అనిపించింది. బ్రేక్ ఈవెన్ కి రూ.0.20 కోట్ల(షేర్) స్వల్ప నష్టాలతో యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. అంచనాలు లేకుండా వచ్చి ఈ సినిమా బాగానే కలెక్ట్ చేసింది అని చెప్పాలి. ఇంకాస్త ప్రమోట్ చేసి ఉంటే క్లీన్ హిట్ గా నిలిచి ఉండేది.