Uma Devi Remuneration: రెమ్యునరేషన్ ని దానం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్!

‘కార్తీకదీపం’ సీరియల్ లో అర్ధపావు భాగ్యం పాత్రలో కామెడీ పండిస్తూ బాగా పాపులర్ అయింది నటి ఉమాదేవి. బుల్లితెర ప్రేక్షకుల్లో ఈమెకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అదే ఆమెకి బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనే అవకాశాన్ని కల్పించింది. తెలుగులో ప్రసారమవుతోన్న బిగ్ బాస్ సీజన్ 5లో ఆమె కంటెస్టెంట్ గా పాల్గొంది. తన వాయిస్ తో హౌస్ మొత్తాన్ని గడగడలాడించింది. నామినేషన్స్ సమయంలో హౌస్ మేట్స్ చాలా మందితో ఆమెకి గొడవ జరిగింది.

రెండో వారం ఎలిమినేషన్ లో ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. తాజాగా ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. తన రెమ్యునరేషన్ ను ఓ మంచి కోసం వినియోగించింది. బిగ్ బాస్ ద్వారా తనకు వచ్చిన రెమ్యునరేషన్ లో కొంత మొత్తాన్ని బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారిని ఆదుకునేందుకు అందించింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఉమా మంచి మనసుని మెచ్చుకుంటూ పోస్ట్ లు పెడుతున్నారు. చిన్నారికి ప్రాణం పోసిన ఉమాదేవికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నారు.

ఇక ఆమె షో నుంచి బయటకు వెళ్లిపోయిన తరువాత షోలో పస లేకుండా పోయిందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు హౌస్ లో ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus