ఉమామహేశ్వర ఓటిటిలో వచ్చేస్తున్నాడు

టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ ఇటీవలే ఓ చిత్రాన్ని ఓ టి టి లో విడుదల చేశారు. ఆయన నటించిన 47డేస్ ప్రస్తుతం జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి మిశ్రమ స్పందన రావడం జరిగింది. ప్రతిభ ఉన్నా సరైన బ్రేక్ రాక ఇబ్బంది పడుతున్న సత్యదేవ్ ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఓ మలయాళ హిట్ మూవీకి తెలుగు రీమేక్ గా ఈచిత్రం తెరకెక్కింది. కాగా ఈ మూవీ నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదల సిద్ధంగా ఉంది.

ఐతే ఇప్పట్లో థియేటర్స్ మొదలయ్యే సూచనలు లేవు. దీనితో ఈ మూవీని ఓ టి టి లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య మూవీ విడుదల తేదీ కన్ఫర్మ్ అయ్యింది. ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. అలాగే ఈ చిత్రాన్ని జులై 15నుండి అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, సాంగ్స్ ప్రేక్షకులకు బాగా దగ్గర కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Uma Maheswara Ugra Roopasya team looking for OTT release1

దానికి తోడు కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీతో అందరి ద్రుష్టి ఆకర్షించిన దర్శకుడు వెంకటేష్ మహా తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆర్కా మీడియా నిర్మిస్తున్న ఈ చిత్రం మరి ఎంత వరకు ప్రేక్షకులకు నచ్చుతుందో చూడాలి. ఈ మూవీ విజయం సత్యదేవ్ కి చాలా అవసరం.

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus