Bheem Look: ఆర్ఆర్ఆర్ కొమరం భీమ్ బీస్ట్ లుక్.!

SS రాజమౌళి దర్శకత్వం వహించిన RRR కోసం ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ గతంలో ఎప్పుడు లేని విధంగా బాడీ విషయంలో చాలా మార్పులు తీసుకు వచ్చారు. ఈరోజు ఎన్టీఆర్ మరియు చరణ్‌లను విడివిడిగా చూపించే రెండు కొత్త పోస్టర్‌లతో అభిమానులను ఆశ్చర్యపరిచేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నారు.

ఇక ముందుగా విడుదలైన పోస్టర్‌లో ఎన్టీఆర్ బీస్ట్ లుక్ కనిపిస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విదంగా తారక్ సరికొత్త లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. కొమరం భీమ్‌గా జూనియర్ బలశాలిగా పవర్ఫుల్ కండలతో చాలా బలంగా కనిపిస్తున్నాడు. అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ పోస్టర్ సాయంత్రం 4 గంటలకు విడుదల కానుంది. ఇక RRR ట్రైలర్ డిసెంబర్ 9న విడుదలవుతోంది.

అసలైతే ట్రైలట్ ను ఈ నెల 3వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. ముందుగానే అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు. అయితే కొన్ని కారణాల వలన మళ్ళీ వాయిదా వేయక తప్పలేదట. సినిమాను వాయిదా వేస్తున్న కారణంగానే ట్రైలర్ రిలీజ్ కూడా ఆపివేసినట్లు చాలా కామెంట్స్ వచ్చాయి. ఇక ఫైనల్ గా అందులో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ 9వ తేదీన ట్రైలర్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇక సినిమాను వచ్చే ఏడాది జనవరి 7 ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు పోస్టర్ లో కూడా క్లారిటీ ఇచ్చారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus