Annamayya Movie: ‘అన్నమయ్య’ గురించి మనకు తెలియని ఆసక్తికరమైన విషయం..!
- October 1, 2021 / 06:07 PM ISTByFilmy Focus
అప్పటి వరకు లవర్ భాయ్‌గా, ఫ్యామిలీ హీరోగా, మాస్ హీరోగా అలరించిన అక్కినేని నాగార్జున… తనలోని మరో కోణాన్ని బయటపెట్టిన చిత్రం ‘అన్నమయ్య’. నాగార్జున లాంటి యూత్ ఐకాన్.. అలాంటి స్టార్‌ని భిన్నమైన భక్తి పాత్రలో చూపించడం అనేది సాధారణమైన విషయం కాదు. నిజంగా అది పెద్ద సాహసమే. కానీ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గారు ఆ సాహసం చేసి మరీ గ్రాండ్ సక్సెస్ కొట్టారు. గతంలో ‘శివ’ తో ఓ గేమ్ ఛేంజర్ మూవీని చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్న నాగార్జున ..
‘అన్నమయ్య’ తో తెలుగు ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ముంచేశారు. ఈ సినిమా ఈ స్థాయిలో హిట్ అవ్వడంలో పాటలు కూడా కీలక పాత్ర పోషించాయి అని చెప్పొచ్చు.అందుకు సంగీత దర్శకులు కీరవాణి గారిని ప్రత్యేకంగా అభినందించాల్సిందే. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో అన్నమయ్యని ప్రేమించే అతని మరదళ్ళు మరియు అక్కా చెల్లెల్లుగా రమ్యకృష్ణ, కస్తూరి నటించారు. తిమ్మక్క, అక్కలమ్మ పాత్రల్లో వారు నటించారు.అన్నమ్మయ్య తన ఇద్దరు రసాధిదేవతలకు శృంగారార్చన చేస్తే ఎలా ఉంటుంది?

ఈ సందర్భానికి తగ్గ ఓ పాట ఉంటే బాగుంటుందనుకున్నారు దర్శకులు రాఘవేంద్రరావు గారు. ఆ పాటను వేటూరి గారితో రాయించాలనుకున్నారు. అయితే ఆ టైమ్‌లో వేటూరి గారి చాలా బిజీగా ఉండటం వల్ల … ‘అన్నమయ్య’ స్టోరీ రైటర్ జె.కె. భారవిని పిలిచి, ఆ పాటని రాసే బాధ్యతను అప్పగించారు. సందర్భం భారవికి తెలుసు కాబట్టి… కేవలం 20 నిమిషాల్లో ఆ పాటను రాసి రాఘవేంద్రరావు గారి చేతిలో పెట్టారు.అది ఆయనకి వెంటనే నచ్చేసింది. సంగీత దర్శకుడు కీరవాణి కూడా అద్భుతం అని చెప్పారు. ఆ వెంటనే దాన్ని ఆయన సింగర్ మనో చేత పాడించి, రికార్డ్ చేయించేశారు.

ఆ తరువాతి రోజే కేవలం రెండే రెండు గంటల్లో ఈ పాటను చిత్రీకరణ పూర్తి చేశారు రాఘవేంద్రరావు గారు. ఆయన కెరీర్ లో అంత వేగంగా చిత్రీకరించిన పాట ఇదే కావడం విశేషం! ‘పదహారు కళలకు ప్రాణాలైన నా ప్రణవ ప్రణయ దేవతలకు ఆవాహనం..” అంటూ సాగే ఈ పాట తెర పై కూడా చూడడానికి చాలా చక్కగా ఉంటుంది.భక్తిని, రక్తిని సమపాళ్లలో దట్టించిన ఈ పాట శ్రోతలను విపరీతంగా అలరించింది.
రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!
















