ఉదయ్ కిరణ్.. ఈ పేరు అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే.. ‘చిత్రం’ తో కెరీర్ ను ప్రారంభించిన ఇతను ఆ తర్వాత ‘నువ్వు నేను’ ‘మనసంతా నువ్వే’ చిత్రంతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇందులో రెండు సినిమాలు తేజ డైరెక్ట్ చేసినవే అన్న సంగతి తెలిసిందే. అయితే ‘మనసంతా నువ్వే’ సినిమాలో ఉదయ్ కిరణ్ కు ఛాన్స్ రావడానికి కూడా తేజనే కారణం. నిజానికి ‘మనసంతా నువ్వే’ చిత్రాన్ని మహేష్ బాబుతో చేయాలని యం.యస్.రాజు అనుకున్నారు.
కానీ ఆ కథ పై మహేష్ కు ఇంట్రెస్ట్ లేక వదిలేశారు.దీంతో యం.యస్.రాజు ఆ కథని కొత్త హీరోతో చేద్దాం అని డిసైడ్ అయ్యి ఆడిషన్స్ చేయడం మొదలుపెట్టారు. అదే టైంలో దర్శకుడు తేజకి ఆయన ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. అప్పుడు తేజ.. ఉదయ్ కిరణ్ ను రిఫర్ చేయడం జరిగింది. అలా ‘మనసంతా నువ్వే’ చిత్రం కూడా ఉదయ్ కిరణ్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఆ తర్వాత అతనికి బోలెడన్ని ఆఫర్లు, ముఖ్యంగా పెద్ద బ్యానర్లో సినిమాలు చేసే అవకాశం లభించింది.
ఈ క్రమంలో తేజ .. ఉదయ్ కిరణ్ తో సినిమా చేయడానికి ప్రయత్నిస్తే అస్సలు ఖాళీగా లేనని చెప్పాడట. అయితే తర్వాత ఉదయ్ కిరణ్ పర్సనల్ లైఫ్ కూడా అప్సెట్ అవ్వడం. పెద్ద ఆఫర్లు అతని చేజారిపోవడంతో మళ్ళీ తేజ వద్దకే వచ్చి సినిమా చేద్దాం అని కాళ్ళ మీద పడ్డాడట. దీంతో తేజ ‘ఔనన్నా కాదన్నా’ సినిమా చేశారు. 2005 ఏప్రిల్ 6న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. కానీ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు.
జస్ట్ యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. తేజ – ఉదయ్ కిరణ్ కాంబినేషన్లో వచ్చిన (Aunanna Kaadanna) ఈ మూవీ హ్యాట్రిక్ హిట్ అందుకోలేకపోయింది. అందుకు కారణం ఏంటని తేజని అడిగితే.. ‘మా కాంబినేషన్ కు ఆ టైంలో క్రేజ్ లేదు. హ్యాట్రిక్ కొడదామని కాకుండా.. తిరిగి మేము ఫామ్లోకి రావాలని ఆ సినిమా తీశాం. అందుకే రిజల్ట్ తేడా కొట్టింది. కానీ ఈ మూవీ కమర్షియల్ గా సేఫ్ అయ్యింది. మా కాంబినేషన్లో మూవీ ఇంకాస్త ముందు వచ్చి ఉంటే మాకు హ్యాట్రిక్ దక్కేదేమో’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.