దేశం గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం కచ్చితంగా ఉంటారు. ఆయన కెరీర్లో ఎన్నో క్లాసిక్ సినిమాలు ఉన్నాయి. అందులో ‘బొంబాయి’ (Bombay) కి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 1995 మార్చి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 30 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి :
1) 1993వ సంవత్సరంలో మణిరత్నం (Mani Ratnam) ‘దొంగ దొంగ’ అనే సినిమా షూటింగ్ చేస్తున్న టైం అది. అదే సమయంలో ఊహించని విధంగా అక్కడ అల్లర్లు చెలరేగాయి. హిందూ, ముస్లిం..ల మధ్య మత కలహాలు చెలరేగాయి. దీంతో అక్కడ ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కు ఇబ్బందులు వచ్చాయి. ఆ టైంలో మణిరత్నం అప్సెట్ అయ్యారు. అయితే దానినే సబ్జెక్ట్ గా మార్చుకుని.. ఫిక్షన్ జోడించి సినిమా ఎందుకు తీయకూడదు అనే ఆలోచన మణిరత్నంకి వచ్చింది.
2) అంతే వెంటనే ఆ సినిమా కథను రెడీ చేయమని మలయాళ రచయిత ఎం.టి.వాసుదేవన్ కి చెప్పారు. కానీ వాసుదేవన్ కొంచెం ఆలస్యం చేయడం వల్ల సమాంతరంగా మణిరత్నం కూడా తన పెన్ కి పనిపెట్టారు. తన స్టైల్లో కథ, కథనాలు రెడీ చేసుకున్నారు.
3) ‘బొంబాయి’ (Bombay)అనే టైటిల్ తోనే ఈ కథని ఆడియన్స్ కి చెప్పాలి అనుకున్నారు. కానీ అందుకు స్టార్ హీరో వద్దు అని ఆయన డిసైడ్ అయ్యారు. ఎందుకంటే స్టార్ హీరోని పెట్టుకుంటే ఆయన చెప్పాలనుకున్న పాయింట్ పై ఆడియన్స్ దృష్టి పెట్టరు. అదే కొత్త హీరో అయితే.. వాళ్ళు కథపైనే ఫోకస్ పెడతారు. అది మణిరత్నం ఆలోచన.
4) అందుకే ఆయన ముందుగా ఈ సినిమాని విక్రమ్ తో (Vikram) చేయాలని అనుకున్నారు. హీరోయిన్ గా మనీషా కొయిరాలాని (Manisha Koirala) ఫైనల్ చేశారు. విక్రమ్, మనీషా కొయిరాలా..లపై ఫోటో షూట్ కూడా చేశారు. అయితే విక్రమ్.. వేరే సినిమా కోసం గడ్డం, మీసాలు పెంచారు. ఆ లుక్ ముంబై సినిమాకి అడ్డుగా మారింది. దీంతో అతను తన సినిమా కోసం తప్పుకోవాల్సి వచ్చింది.
5) ఈ క్రమంలో మళ్ళీ మణిరత్నం ఆలోచనలో పడ్డారు. కొంతమంది కొత్త హీరోలకి లుక్ టెస్ట్ చేశారు. కానీ ఎవ్వరూ సెట్ అవ్వలేదు. దీంతో తనతో ‘రోజా’ (Roja) చేసిన అరవింద్ స్వామినే (Arvind Swamy) ‘బొంబాయి’ కోసం ఎంపిక చేసుకున్నారు. ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి శేఖర్ గా మణిరత్నం లుక్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.
6) ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ ముంబైలో ప్లాన్ చేశారు. కానీ టెక్నికల్ టీంకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని తెలుసుకుని తర్వాత చెన్నైలోని ఓ స్టూడియోలో సెట్ వేశారు. ‘బొంబాయి’ సినిమా ముంబైలో 3 రోజులు మాత్రమే షూట్ చేశారు. మిగతా భాగం అంతా చెన్నైలోనే తీయడం విశేషంగా చెప్పుకోవాలి. కానీ సినిమా చూస్తున్నప్పుడు అది ఎక్కడా లోటుగా అనిపించదు. అది అంతా మణిరత్నం మేకింగ్ మాయాజాలం అని చెప్పాలి.
7) మనీషా కొయిరాలా ఈ సినిమాలో శైలా భాను పాత్రలో నటించారు. తమిళంలో ఈమెకు మొదటి సినిమా ఇదే. ఇది మంచి సక్సెస్ అవ్వడంతో శంకర్ దర్శకత్వంలో వెంటనే ‘ఇండియన్’ సినిమా చేసే ఛాన్స్ ఈమెకు దక్కింది.
8) ‘హమ్మా హమ్మా’ అనే పాటలో సీనియర్ స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే (Sonali Bendre) కూడా కామియో ఇచ్చింది. తమిళంలో ఆమెకు ఇదే మొదటి సినిమా.
9) ఏ.ఆర్.రెహమాన్ (A.R.Rahman) సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్సే. ‘ఉరికే చిలకా’ ‘కన్నానులే’ ‘హమ్మ హమ్మ’ ‘కుచ్చి కుచ్చి’ వంటి పాటలు ఇప్పుడు విన్నా చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి.
10) బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ కేటగిరిలో నిర్మాతగా, దర్శకుడిగా మణిరత్నంకి అవార్డు లభించింది. అలాగే బెస్ట్ ఎడిటింగ్ కేటగిరిలో కూడా సురేష్ కి (Suresh Urs) కూడా నేషనల్ అవార్డు లభించింది.