Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Focus » పార్ట్ 1 : అవసరం లేకపోయినా ఈ 15 సినిమాల్లో ఆ స్టార్స్ ని తెచ్చి పెట్టారు..!

పార్ట్ 1 : అవసరం లేకపోయినా ఈ 15 సినిమాల్లో ఆ స్టార్స్ ని తెచ్చి పెట్టారు..!

  • March 11, 2025 / 03:55 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పార్ట్ 1 : అవసరం లేకపోయినా ఈ 15 సినిమాల్లో ఆ స్టార్స్ ని తెచ్చి పెట్టారు..!

‘బంగారపు హుండీని చిల్లర వేయడానికి పెట్టుకున్నారు’ ఇది ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ సినిమాలో డైలాగ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మన టాలీవుడ్ ఫిలిం మేకర్స్ గురించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే సరైన పాత్రలు తమ సినిమాల్లో లేకపోయినా పక్క భాషల్లోని నటీనటులకి భారీ పారితోషికం ఇచ్చి నిర్మాతలు టాలీవుడ్ కి తెచ్చారు తెస్తున్నారు. ఆ లిస్టులో ఉన్న నటీనటులు.. వాళ్ళు చేసిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

Hero

List of Other Language Hero Roles That Were Wasted (1)

1) దునియా విజయ్ – వీరసింహారెడ్డి (Veera Simha Reddy) :

List of Other Language Hero Roles That Were Wasted (1)

కన్నడలో మంచి పాపులర్ హీరో ఇతను. ఇతన్ని బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమాల్లో విలన్ గా తీసుకున్నారు అంటే కచ్చితంగా ఇతని రోల్ పవర్ఫుల్ గా ఉంటుందేమో అని అంతా ఆశించడం సహజం. కానీ సినిమాలో (Veera Simha Reddy) ఇతను ప్రతిసారి ఎగేసుకుని వెళ్లి హీరోతో తన్నులు తిని రావడం తప్ప చేసేది ఏమీ ఉండదు. బహుశా దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) ఇతన్ని సరిగ్గా వాడలేదేమో.

2) విజయ్ సేతుపతి (Vijay Sethupathi) – మైఖేల్ (Michael) :

List of Other Language Hero Roles That Were Wasted (1)

సందీప్ కిషన్  (Sundeep Kishan) హీరోగా (Hero) తెరకెక్కిన సినిమా ఇది. విజయ్ సేతుపతి తమిళంలో పెద్ద స్టార్. తెలుగులో కూడా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇతన్ని ‘మైఖేల్’ లో తీసుకున్నారు అంటే కచ్చితంగా ఆ పాత్రకు వెయిటేజీ ఉంటుందని అంతా అనుకుంటారు. కానీ ఆ పాత్రకి ఎటువంటి మెరుపులు ఉండవు. చాలా వీక్ గా ఉంటుంది. మరి విజయ్ సేతుపతి ఈ పాత్రకు ఎందుకు ఒప్పుకున్నాడో అతనికే తెలియాలి.

3) సుశాంత్ (Sushanth) – రావణాసుర (Ravanasura) :

List of Other Language Hero Roles That Were Wasted (1)

సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వంలో రవితేజ (Ravi Teja) హీరోగా తెరకెక్కిన సినిమా ఇది. ఈ సినిమాలో సుశాంత్ నటించాడు. కానీ ఇందులో అతని పాత్ర చాలా కామెడీగా ఉంటుంది. అతని కెరీర్ కి ఎటువంటి బూస్టప్ ఇవ్వని సినిమా ఇది.

4) అదితి బాలన్ – శాకుంతలం (Shaakuntalam) :

List of Other Language Hero Roles That Were Wasted (1)

తమిళంలో పాపులర్ నటి ఈమె.అలాంటి మంచి నటిని ‘శాకుంతలం’ సినిమా కోసం తీసుకున్నాడు దర్శకుడు గుణశేఖర్ (Gunasekharw). కానీ ఈ సినిమాలో ఆమె పాత్ర జూనియర్ ఆర్టిస్ట్ ను పోలి ఉంటుంది.

5) మమ్ముట్టి (Mammootty) – ఏజెంట్ (Agent) :

List of Other Language Hero Roles That Were Wasted (1)

అఖిల్ (Akhil Akkineni) హీరోగా (Hero) సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో మమ్ముట్టి  కూడా నటించాడు. ఆయనకు తెలుగులో చాలా మంచి సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. కానీ ‘ఏజెంట్’  నే ఆయన ఎంపిక చేసుకున్నారు. కానీ పాత్రలో ఎటువంటి దమ్ము ఉండదు. కేవలం పారితోషికం కోసమే ఎంపిక చేసుకున్నారేమో అనిపిస్తుంది.

6) అరవింద్ స్వామి (Arvind Swamy) – కస్టడీ (Custody) :

List of Other Language Hero Roles That Were Wasted (1)

నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ఇందులో అరవింద్ స్వామి  నటించాడు. అయితే అతని పాత్ర ఏమీ పవర్ఫుల్ గా ఉండదు. ఆ మాత్రం పాత్రకి తెలుగులో ఫేడౌట్ అయిపోయిన హీరో అయినా సరిపోతాడు.

7) శరత్ కుమార్ (R. Sarathkumar) – రంగబలి (Rangabali) :

List of Other Language Hero Roles That Were Wasted (1)

నాగ శౌర్య (Naga Shaurya) హీరోగా నటించిన ఈ సినిమాలో శరత్ కుమార్ కూడా నటించారు. అయితే ఆ పాత్ర సినిమాలో ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. తలనరికించుకోవడానికి అలాంటి పెద్ద స్టార్ అవసరమా అనే విమర్శలు కూడా వచ్చాయి.

8) బ్రహ్మానందం (Brahmanandam) – కీడా కోలా (Keedaa Cola) :

List of Other Language Hero Roles That Were Wasted (1)

ఈ సినిమాలో బ్రహ్మానందంని ఓ వీల్ చెయిర్ పై కూర్చోబెట్టడం, యూరిన్ బ్యాగ్ మోసేలా చేయడం వంటివి అతని అభిమానులకే కాదు, యావత్ తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చలేదు. మరి ఈ పాత్ర చేయడానికి బ్రహ్మి ఎలా ఒప్పుకున్నారో..!

9) జోజు జార్జ్ (Joju George), అపర్ణ దాస్ (Aparna Das)- ఆది కేశవ (Aadikeshava) :

List of Other Language Hero Roles That Were Wasted (1)

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej) ‘సితార బ్యానర్’ లో చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో విలన్ గా మలయాళం హీరో జోజు జార్జ్ ను తీసుకున్నారు. కానీ ఈ సినిమాలో అతని పాత్రకు ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు. అలాగే ఇందులో తమిళ పాపులర్ నటి అపర్ణ దాస్ కూడా నటించింది. ఆమె పాత్రకి కూడా ఇంపార్టెన్స్ ఉండదు. మంచి ఆర్టిస్టుల కాల్ షీట్లు, నిర్మాత డబ్బు వేస్ట్ అయిపోయింది.

10) రాజశేఖర్ (Rajasekhar) – ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్ (Extra Ordinary Man) :

List of Other Language Hero Roles That Were Wasted (1)

వక్కంతం వంశీ (Vakkantham Vamsi) దర్శకత్వంలో నితిన్ (Nithin Kumar) హీరోగా తెరకెక్కిన సినిమా ఇది. ఈ సినిమాతో రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. వాస్తవానికి రాజశేఖర్ కి ‘రంగస్థలం’ లో (Rangasthalam) జగపతి బాబు (Jagapathi Babu) చేసిన పవర్ఫుల్ రోల్ కోసం సంప్రదించారు. ఇంకా చాలా మంచి పాత్రలకి రాజశేఖర్ ను సంప్రదించారు టాలీవుడ్ డైరెక్టర్లు. అయినా సరే ‘ఎక్స్ట్రా’ నే రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎంపిక చేసుకున్నారు. పోనీ ఈ సినిమాలో అతని పాత్రకు ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా? అంటే నథింగ్..!

11) జగపతి బాబు (Jagapathi Babu) – గుంటూరు కారం (Guntur Kaaram) :

List of Other Language Hero Roles That Were Wasted (1)

త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu) నటించిన సినిమా ఇది. ఇందులో జగపతి బాబు ఓ పాత్ర చేశాడు. అది సినిమా కథకి ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది లేదు. ‘అసలు నేను ఎందుకు ‘గుంటూరు కారం’ లో నటించానో నాకే తెలీదు. ఆ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించేది’ అంటూ జగపతి బాబే ఓ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే అర్థం చేసుకోవచ్చు. అది ఎంత ఘోరమైన పాత్రో..!

12) ఆర్య (Arya) – సైందవ్ (Saindhav) :

List of Other Language Hero Roles That Were Wasted (1)

శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో వెంకటేష్ 75వ సినిమాగా ఇది రూపొందింది. ఈ సినిమాని వెంకటేష్ (Venkatesh Daggubati) కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మించారు నిర్మాత వెంకట్ బోయినపల్లి. కానీ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. అయితే ఈ సినిమాలో తమిళ హీరో ఆర్య కూడా నటించాడు. ఆ విషయం చాలా మందికి గుర్తుండదు. తమిళంలో కోట్లు పారితోషికం అందుకునే ఆ హీరోని ఎందుకు ‘సైందవ్’ కోసం భారీగా ఖర్చు పెట్టి తీసుకున్నారో అర్థం కాదు.

13) షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) – దేవర (Devara) :

List of Other Language Hero Roles That Were Wasted (1)

మలయాళంలో టామ్ చాకో క్రేజీ ఆర్టిస్ట్. ‘దసరా’ తో (Dasara) తెలుగులో కూడా బాగా పాపులర్ అయ్యాడు. ఇతను ‘దేవర’ లో నటించాడు. సినిమాలో అతని పాత్రకి ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు. పది మందిలో ఒకడిగా ఉండి ఎంతసేపు సిగరెట్లు,బీడీలు కాల్చుకోవడం తప్ప.. ఇతను సినిమాలో చేసేది ఏమీ ఉండదు. అయినా భారీగా ఖర్చు పెట్టి ఇతన్ని ఎందుకు తీసుకున్నారో మేకర్స్ కే తెలియాలి.

14) నోరా ఫతేహి (Nora Fatehi) – మట్కా (Matka) :

List of Other Language Hero Roles That Were Wasted (1)

వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా కరుణ కుమార్ (Karuna Kumar ) దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్. అయితే నోరా ఫతేహి కూడా ఈ సినిమాలో నటించింది. ఆమె పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. అయినా రోజుకు రూ.40 లక్షల వరకు పారితోషికం చెల్లించి ఆమెను ఎందుకు తీసుకున్నారో అర్థం కాదు.

15) ప్రియదర్శి (Priyadarshi) – గేమ్ ఛేంజర్ (Game Changer) :

List of Other Language Hero Roles That Were Wasted (1)

శంకర్ (Shankar) దర్శకత్వంలో రాంచరణ్ (Ram Charan) నటించిన సినిమా ఇది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో అందరికీ తెలుసు. నిర్మాత దిల్ రాజుకి (Dil Raju) భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ప్రియదర్శి కూడా నటించాడు. అతను సినిమాలో ఉన్నట్టు చాలా మందికి తెలీదు. అతను ఇప్పుడు హీరోగా కూడా చేస్తున్నాడు. రోజుకి అతని కాల్ షీట్ రూ.20 లక్షలకి పైనే ఉంటుంది. అయినా అతన్ని ఎందుకు ఈ సినిమాలో పెట్టుకున్నారో.. అతని పాత్రకు ఉన్న ప్రాముఖ్యత ఏంటో మేకర్స్ కే తెలిసుండాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aarya
  • #Arvind Swamy
  • #Brahmanandam
  • #Duniya Vijay
  • #jagapathi babu

Also Read

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Junior Trailer: కష్టం రానంతవరకు అదృష్టమే..!

Junior Trailer: కష్టం రానంతవరకు అదృష్టమే..!

related news

Jagapathi Babu: 30 ఏళ్ళ క్రితం జగపతి బాబు సినిమా విషయంలో అంత జరిగిందా?

Jagapathi Babu: 30 ఏళ్ళ క్రితం జగపతి బాబు సినిమా విషయంలో అంత జరిగిందా?

Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’… డేట్ ఫిక్స్..!

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

trending news

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

2 hours ago
Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

5 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

5 hours ago
Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

7 hours ago
Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

7 hours ago

latest news

Vadde Naveen: సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ!

Vadde Naveen: సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ!

2 hours ago
Ravi Teja: రవితేజ- కిషోర్ తిరుమల ప్రాజెక్టుకి ఏమైంది..!

Ravi Teja: రవితేజ- కిషోర్ తిరుమల ప్రాజెక్టుకి ఏమైంది..!

5 hours ago
వేలంలో ఆ ప్రముఖ నటి హ్యాండ్‌ బ్యాగ్‌కు భారీ ధర.. అంత పెట్టి కొని..!

వేలంలో ఆ ప్రముఖ నటి హ్యాండ్‌ బ్యాగ్‌కు భారీ ధర.. అంత పెట్టి కొని..!

5 hours ago
Lishalliny Kanaran: పూజారిపై ప్రముఖ నటి సంచలన ఆరోపణలు.. ఏమైందంటే?

Lishalliny Kanaran: పూజారిపై ప్రముఖ నటి సంచలన ఆరోపణలు.. ఏమైందంటే?

6 hours ago
9 సినిమాలు ఆపేసిన ఒక సినిమా.. ఆ సినిమా ఏంటి? ఆ హీరోయిన్‌ ఎవరు?

9 సినిమాలు ఆపేసిన ఒక సినిమా.. ఆ సినిమా ఏంటి? ఆ హీరోయిన్‌ ఎవరు?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version