టాలీవుడ్‌లో మోస్ట్ ట్రోల్డ్ హీరోస్ అంటూ ఓ లిస్ట్ రాస్తే.. అందులో తొలుత వచ్చే పేర్లలో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కచ్చితంగా ఉంటుంది. ఎందుకో కానీ ఆయన ఏం చేసినా ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. ఆయన తొలుత పట్టించుకున్నా తర్వాత వదిలేశాడు. కానీ ఊరికనే అంటుంటే మనసు ఒప్పదు కదా. మొన్నీమధ్య కూడా ‘నేనే పాపం చేశాను’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. పోనీ ఆయనే నెపో కిడ్ అంటే కాదు. కానీ ఎందుకో మాటలు పడుతున్నాడు.
Kiran Abbavaram
ఈ నేపథ్యంలో కిరణ్ అబ్బవరం లైఫ్ గురించి చర్చ జరుగుతోంది. మంచి ఉద్యోగం మానుకొని సినిమాల్లోకి వచ్చేశాడు అని మాత్రమే చాలా మందికి తెలుసు. ఇదొక్కటే కాదు ఆయన వెనుక చాలా పెద్ద కథే ఉంది. కిరణ్‌ది కడప జిల్లా రాయచోటి దగ్గర ఓ గ్రామం అనే విషయం తెలిసిందే. అప్పులు కట్టడం తప్పు ఆస్తులు కూడబెట్టడం తెలియని కుటుంబం వాళ్లది. దీంతో కిరణ్ తల్లి కూలికి వెళ్లేవారట. మెడలో తాళి పెళ్లప్పుడే ఉందట. ఆ తర్వాత పసుపుకొమ్మే.
ఆ ఊరిలో గొర్రెలు మేపుకునేవాళ్లే ఎక్కువగా ఉండటంతో.. తన పిల్లలు అటువైపు వెళ్లకూడదు అని కిరణ్ చిన్నతనంలోనే ఆమె.. కువైట్ వెళ్లి అక్కడ 20 ఏళ్ల పాటు వివిధ పనులు చేసి డబ్బులు సంపాదించి ఇంటికి పంపించేవారట. అలా తన తల్లి అన్నేళ్లపాటు పంపిన డబ్బులతో కుటుంబం నిలబడిందని కిరణ్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. తనకు యుక్త వయసు వచ్చే వరకు తన తల్లితో రెండేళ్లకు మించి గడపలేదు కిరణ్ చెప్పాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
తల్లి సంపాదనతో రూ. నాలుగు లక్షలు పెట్టి రాయచోటిలో ఓ ఇల్లు కొనగా.. ఆ తర్వాత కొన్నాళ్లకు అప్పులు తీర్చడానికి ఆ ఇంటిని అమ్మకానికి పెట్టారట. అలా కొన్నాళ్ల ఉద్యోగంలో చేరిన సమయంలో ఇంకా ఏదైనా సాధించండి అని తల్లి చెబితే.. ఆలోచనలో పడి నటన వైపు అడుగులేడు కిరణ్. తొలుత షార్ట్ ఫిల్మ్స్ చేసి.. ఆ తర్వాత హీరోగా అవకాశం అందుకున్నాడు. ఇప్పుడు ‘క’ (KA)సినిమాతో విజయం సాధించాడు.