Keerthi Bhat: ‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ కీర్తి భట్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

తెలుగులో బిగ్ బాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆల్రెడీ 5 సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగిసాయి. ఈ ఏడాది ఓటీటీ సీజన్ కూడా జరిగింది. కానీ అది అంత సక్సెస్ కాలేదు. కానీ సీజన్ 6 పై ముందు నుండి అంచనాలు పెరిగాయి.ఈ సీజన్ ను కూడా నాగార్జునే హోస్ట్ చేస్తున్నారు. ఇక ఆదివారం నాడు బిగ్ బాస్ 6 గ్రాండ్ గా ప్రారంభమైంది. ‘బిగ్ బాస్ 6’ లో మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది కీర్తి భట్. పలు తెలుగు సీరియల్స్ ద్వారా ఈమె ప్రేక్షకులకు దగ్గరైంది. ముఖ్యంగా ‘కార్తీక దీపం’ సీరియల్ లో హిమ అనే అమాయకపు అమ్మాయి పాత్ర పోషిస్తుంది. ఈమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) కీర్తి భట్ పూర్తి పేరు కీర్తి కేశవ్ భట్. 1992 వ సంవత్సరం జూన్ 2న మంగళూర్లో జన్మించింది. ఈమె విద్యాభ్యాసం అంతా బెంగుళూరులో జరిగింది.

2) ఓ యాక్సిడెంట్ లో తల్లిదండ్రులని పోగొట్టుకుంది కీర్తి భట్. అంతేకాదు, తన బ్రదర్ ని, సిస్టర్ ని కూడా పోగొట్టుకుని మూడు నెలలపాటు తను కోమాలో ఉండిపోయింది.ఆమె ఫ్యామిలీలో ఎవ్వరూ మిగల్లేదు. ఈమె చాలా వరకు ఒంటరిగానే జీవించింది, జీవిస్తుంది. తనలాంటి పరిస్థితి శత్రువుకి కూడా రాకూడదు అని ఆమె ఎమోషనల్ గా హౌస్ లోకి వెళ్ళే ముందు చెప్పుకొచ్చింది.

3) 2017 వ సంవత్సరంలో రూపొందిన కన్నడ చిత్రం ‘ఐస్ మహల్’ తో ఈమె నటిగా మారింది.

4) కీర్తి భట్ ఒక మోడల్ కూడా..!కానీ మోడలింగ్ రంగంలోకి ఉన్నన్ని రోజులు ఈమెకు అవకాశాలు రాలేదు.

5)’ఐస్ మహల్’ సినిమా మంచి ఫలితం అందుకోలేదు కానీ ఈమెకు సీరియల్స్ లో అవకాశాలు వచ్చేలా చేసింది.

6) తెలుగులో ఈమె ‘మనసిచ్చి చూడు’ సీరియల్ తో అడుగుపెట్టింది. ఆ తర్వాత కార్తీకదీపం సీరియల్ లో కూడా ఛాన్స్ దక్కించుకుంది.

7) కీర్తి భట్.. భరతనాట్యం డాన్సర్ కూడా..!

8) కీర్తి భట్ ఓ పాపను కూడా అడాప్ట్ చేసుకుంది. ఆమె పేరు తను భట్.

9)కీర్తికి ట్రావెలింగ్ మరియు షాపింగ్ అంటే బాగా ఇష్టం. ఖాళీ దొరికినప్పుడల్లా ఆమె వీటికే ప్రిఫరెన్స్ ఇస్తుంది.

10)కీర్తి భట్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి లక్ష మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

11) శ్రీదేవి డ్రామా కంపెనీ, మొగుడ్స్ పెళ్లామ్స్ వంటి టీవీ షోలలో కూడా ఈమె పాల్గొని ప్రేక్షకులను అలరించింది.

12) కాంట్రవర్సీలకు దూరంగా ఉండడమే కీర్తి కి ఇష్టం. చిన్నప్పటి నుండి ఈమె చాలా కష్టాలు పడింది. కాబట్టి దేనిపైనా అత్యాశ పెంచుకోదు. తనకు దక్కిందే ప్రాప్తం అనుకుంటుంది. మరి ‘బిగ్ బాస్ 6 ‘ లో ఈమె జర్నీ ఎన్నాళ్ళు కొనసాగుతుందో చూడాలి..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus