Needa Movie: 43 ఏళ్ల ‘నీడ’ గురించి ఆసక్తికర విశేషాలు..

నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు చేశారు. సాంకేతికంగా కొత్త సొగసులు అద్దారు. దర్శక నిర్మాతగా, ఎడిటర్, స్టూడియో అధినేతగా ప్రభంజనం సృష్టించారు. టాప్ స్టార్‌గా బిజీగా ఉన్న సమయంలోనే ‘అల్లూరి సీతారామరాజు’ తో చైల్డ్ ఆర్టిస్టుగా పెద్ద కొడుకు ఘట్టమనేని రమేష్ బాబుని వెండితెరకు పరిచయం చేశారు. తర్వాత రెండో కుమారుడు మహేష్ బాబుని ‘నీడ’ సినిమాతో బాల నటుడిగా రంగప్రవేశం చేయించారు. దర్శకరత్న దాసరి నారాయణ రావు తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం.. ‘నీడ’..

1979 నవంబర్ 29న ‘నీడ’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. 2022 నవంబర్ 29 నాటికి విజయవంతంగా 43 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. తెలుగు చిత్ర బ్యానర్ మీద రామినేని సాంబశివరావు నిర్మించారు. దాసరి శిష్యుడు, పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి ఇందులో కీలకపాత్రలో (సెకండ్ లీడ్) నటించారు. ఆయనకి కూడా ఇది ఫస్ట్ సినిమానే కావడం విశేషం..

లిటిల్ సూపర్ స్టార్ మహేష్ బాబు..

1975లో పుట్టిన మహేష్ బాబు.. తండ్రి పోలికలతో మద్దుగా ఉండేవాడు. తనను కూడా చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయం చేద్దామనే ఆలోచనలో ఉండగా.. దాసరి ‘నీడ’ గురించి చెప్పడంతో.. 1979 అంటే నాలుగేళ్ల వయసులో తొలిసారి కెమెరా ముందుకొచ్చాడు లిటిల్ సూపర్ స్టార్.. ఈ సినిమా సమయానికి రమేష్ బాబు వయసు 14 సంవత్సరాలు. అప్పుడే ఆయణ్ణి ప్రధాన పాత్రలో పెట్టి ప్రయోగాత్మక చిత్రం చేశారంటే అది కేవలం ఒక్క దర్శకరత్నకే సాధ్యం..

ప్రయోగంతోనే ప్రభంజనం..

దాసరి ఫోటోలతో కూడా పోస్టర్లు వేయడం అంటే అప్పటికే అది పేరు కాదు బ్రాండ్ అనే ముద్రపడిపోయింది. దాసరి 26వ సినిమాగా.. సమర్పకుడిగా తొలి చిత్రంతోనే ఉత్తమ అభిరుచి గల నిర్మాతగా ప్రముఖుల ప్రశంసలందుకుంటున్న శుభ సమయంలో శుభాకాంక్షలు అంటూ ప్రకటనలు ఇచ్చేవారు. ఈ చిత్రానికి కోడి రామకృష్ణ సహాయ దర్శకుడిగా పని చేశారు. రమేష్ నాయుడు సంగీతమందించారు.

కృష్ణ, ఏఎన్నార్, కరుణానిధి అతిథులుగా శత దినోత్సవ సంబరాలు..

‘నీడ’ చిత్రం నాలుగు కేంద్రాల్లో 110 రోజులు ప్రదర్శింపబడింది.. ఈ సందర్భంగా 1980 మార్చి 15న చెన్నైలోని హోటల్ చోళాలో విజయోత్సవ సభ జరిగింది. అధ్యక్షునిగా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు, ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ కృష్ణ, బహుమతి ప్రదాతగా కరుణానిధి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ‘తెలుగు చిత్ర పరిశ్రమ కేసరి దాసరి’ అని కరుణానిధి అభినందించారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus