సూపర్‌స్టార్ కృష్ణ నట జీవితంలో ఎన్నో బ్లాక్ బస్టర్, సంచలనాత్మక చిత్రాలున్నాయి.. నటుడిగానే కాకుండా.. నిర్మాత, దర్శకుడు, ఎడిటర్, రైటర్, స్టూడియో అధినేత.. తొలి సినిమా స్కోప్, 70 ఎమ్ఎమ్, డీటీఎస్, కౌబాయ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రయోగాలు చేశారు. సాహసానికి మారుపేరుగా నిలిచిన కృష్ణ ఒకానొక టైంలో వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నారు.. అప్పుడు వచ్చింది ‘పచ్చని సంసారం’..1993 జనవరి 9న విడుదలైన ‘పచ్చని సంసారం’ 2023 జనవరి 9 నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది..
తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం వహించారు.. పామెక్స్ ఫిలింస్ (ప్రై.లి) బ్యానర్ మీద జి.హరిబాబు నిర్మించారు.. విద్యా సాగర్ సంగీతమందించారు.. ఆమని కథానాయిక.. కోట, బాబు మోహన్, అన్నపూర్ణ, సుధారాణి, వెన్నెల, హేమ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు నటించగా.. గిరిబాబు, నిర్మలమ్మ, నిరోషా అతిథి పాత్రలు పోషించారు..ఆకెళ్ల కథ – మాటలు, భువనచంద్ర, మల్లెమాల పాటలు రాయగా తమ్మారెడ్డి స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ చేశారు.. పల్లెటూరు, వ్యవసాయ నేపథ్యంలో కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ‘పచ్చని సంసారం’ మూవీకి ప్రేక్షకుల ఆదరణ దక్కింది..
సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా కావడంతో నిర్మాతతో పాటు అందరూ లాభాల బాట పట్టారు.. కథ, కథనాలు, మాటలు, పాటలు, క్యారెక్టర్లు, కుటుంబ కలహాలు, వాటి పరిష్కారాలు, కృష్ణ సహజమైన నటన ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్నాయి.. కృష్ణ లాంటి స్టార్ హీరో సినిమాలో నిరోషా – రాజ్ కుమార్‌లకు పాట పెట్టడం విశేషం.. కథలో భాగంగా ఈ పాట వస్తుంది..
తమ్మారెడ్డి ఈ సినిమా తీశారంటే ఎవరూ నమ్మరు.. ఒకరకంగా ఆయన కెరీర్‌లో స్టార్ హీరోతో చేసిన, సూపర్ హిట్ కొట్టిన ఫిలిం ఇదే కావచ్చు.. ఈ సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది.. అదేంటంటే.. కృష్ణ చిత్రాలు వరుసగా అపజయాలు పాలవుతున్న సమయంలో 1992 జనవరి ‘రక్త తర్పణం’ విడుదలైన ఒక సంవత్సరం విరామంలో వచ్చిన విజయోత్సవ చిత్రం ఈ ‘పచ్చని సంసారం’..
8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!
రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!