‘బిగ్ బాస్ 6’ గ్రాండ్ గా స్టార్ అయ్యింది. ఈ సీజన్ ను కూడా నాగార్జునే హోస్ట్ చేస్తున్నారు.ఈ సీజన్ లో 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళలో చాలా మంది ప్రేక్షకులకు తెలీని మొహాలే ఉన్నాయని చెప్పొచ్చు. అందులో షానీ సాల్మాన్ కూడా ఒకరని చెప్పొచ్చు.గతంలో తనకు ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారని, వారి మొదటి అక్షరాలతోనే తన పేరుని S H A N I గా పెట్టుకున్నట్టు తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇతని గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :
1) 1987 వ సంవత్సరం ఏప్రిల్ 23న ఇతను జన్మించాడు. ఇతని వయసు ఇప్పుడు 35 సంవత్సరాలు.
2) జెడ్చర్లకు చెందిన షానీ.. ఉస్మానియా యూనివర్శిటీ లో డిగ్రీ, నిజాం కాలేజ్ పీజీ పూర్తిచేశాడు.
3) నిజానికి ఇతనో స్పోర్ట్స్‌మెన్. హైదరాబాద్ నగరంలో ఓ హోల్డింగ్ చూసి అథ్లెటిక్స్ అండ్ జిమ్నాస్టిక్స్ క్రీడాకారులు కావాలని.. నేషనల్ ఛాంపియన్ అయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నాడట.
4) 2003లో ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు దర్శకుడు రాజమౌళి గారి సినిమా ఆడిషన్స్ ప్రకటన గురించి అని తెలుసుకుని ఆడిషన్ కు అటెండ్ అయ్యాడట.
5) రాజమౌళి కి షానీ లుక్ డిఫరెంట్ గా ఉండడంతో ‘సై’ సినిమాలో అవకాశం కల్పించారట. అదే తన జీవితాన్ని కీలక మలుపు తిప్పిందని షానీ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఆ సినిమా ఘన విజయం కావడంతో సై షానీ గా ఇతను మారిపోయాడు.
6) ఇప్పటివరకు షానీ 70కిపైగా సినిమాల్లో నటించాడట. బహుశా ఈ విషయం చాలా మందికి తెలిసుండకపోవచ్చు.
7) ‘సై’ తో పాటు ‘ఘర్షణ’, ‘దేవదాసు’, ‘హ్యాపీ’, ‘రెడీ’, ‘ఒక్క మగాడు’, ‘శశిరేఖా పరిణయం’ ‘అలా.. ఎలా’ వంటి చిత్రాలు ఇతనికి గుర్తింపు తెచ్చిపెట్టాయి. తాను నటించిన 70 సినిమాల్లో30 సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి.
8) ‘దేశంలో దొంగలు పడ్డారు’ ‘రాక్షసి’ వంటి చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు షానీ.
9) కిన్నెరసాని, అమరన్, గ్రే, పంచతంత్ర కథలు వంటి చిత్రాలు ఈ ఏడాది విడుదల కావాల్సి ఉంది. ఇందులో ‘కిన్నెర సాని’ ‘పంచతంత్ర కథలు’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి.
10) షానీ లైఫ్ లో ట్రాజెడీ కూడా ఉంది. ‘సై సినిమా ఆఫర్ తనకు వచ్చిన రోజునే షానీ అమ్మగారు చనిపోయారట. ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ ఒకే రోజు వినాల్సి వచ్చిందట.
మొత్తంగా 70 సినిమాల్లో నటించినప్పటికీ షామీకి దక్కిన గుర్తింపు అంతంత మాత్రమే..! అయితే ‘బిగ్ బాస్ 6’ లో ఎంట్రీ ఇస్తూనే ప్రేక్షకులందరినీ తన వైపుకి తిప్పుకున్నాడు షానీ. మరి ఈ సీజన్లో ఇతను ఎలా గేమ్ ఆడతాడో.. హౌస్ లో ఎన్ని రోజులు ఉంటాడో తెలియాల్సి ఉంది.