ఇప్పుడంటే రాంగోపాల్ వర్మ వివాదాలు రేపే దర్శకుడు అయిపోయాడు కానీ ఒకప్పుడు ఆయన కూడా స్టార్ డైరెక్టర్ అన్న సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాలీవుడ్లో కూడా సత్తా చాటిన దర్శకుడు ఆయన.అలాంటి దర్శకుడితో సినిమా చేయాలని ఏ నిర్మాతకి మాత్రం ఉండదు. అదే విధంగా మన స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారు కూడా ఆశపడ్డారు. అలా ‘గోవిందా గోవిందా’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు.నాగార్జున హీరో… ఆల్రెడీ ‘శివ’ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కాంబినేషన్, పైగా శ్రీదేవి హీరోయిన్ కావడంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఖర్చుకి ఏమాత్రం వెనుకాడకుండా దత్ గారు బోలెడంత పెట్టేసారు.
కానీ సినిమా డిజాస్టర్ అయ్యింది.ఆయన చాలా నష్టపోయారు. అయితే అదే ఏడాది ఓ మీడియం రేంజ్ సినిమా ఆయన్ని గట్టెక్కించింది. అదే ‘శుభలగ్నం’ మూవీ.’గోవిందా గోవిందా’ 1994 వ సంవత్సరం జనవరి 21న విడుదలైతే.. అదే ఏడాది సెప్టెంబర్ 30న ‘శుభలగ్నం’ రిలీజ్ అయ్యింది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేటితో 27 ఏళ్ళు పూర్తిచేసుకుంటుంది.కాగా ఓ సందర్భంలో జగపతి బాబు ‘శుభలగ్నం’ సక్సెస్ గురించి చెబుతూ.. ‘ ‘వైజయంతీ మూవీస్’ ప్రతి సినిమా వెనుక ఒక కథ ఉంది.కష్టం ఉంది. ఛాలెంజ్ కూడా ఉంది. అలా చేసిన చిత్రమే ‘గోవిందా గోవిందా’.
దత్తుగారి ఇష్టదైవం శ్రీవేంకటేశ్వర స్వామి మీద తెరకెక్కించిన చిత్రం అది. అలరించే పాటలు, అద్భుతమైన చిత్ర నిర్మాణం.. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తాయి. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డుతో మొదటి ఇబ్బంది ఎదురైంది. దాదాపు 50 శాతం సినిమాని కట్ చెయ్యాలని వాళ్ళు నిర్ణయించారు. మొత్తానికి దత్ గారు వారితో వాదించి, గొడవపడి చివరికి అనుకున్న విధంగా 1993 చివర్లో సెన్సార్ చేయించి 1994 జనవరిల్లో విడుదల చేశారు.’దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు’ అన్నట్టు… ఆ చిత్రానికి దేవుడి దీవెన దొరకలేదు.
ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ‘వైజయంతీ మూవీస్’ సంస్థ ఆర్థికంగా పది అడుగులు వెనక్కి వెళ్ళింది.అయితే ఈ సినిమాని ఇప్పుడు టీవీలలో చూసిన వారు మాత్రం అద్బుతం అంటున్నారు. అలా ఒక చోట దేవుడు మనకి దూరం చేసిన దాన్ని మరొక రూపంలో పదిరెట్లు ఎక్కువ ప్రసాదిస్తాడు అంటారు కదా. అలా అదే ఏడాది ఎస్వీ కృష్ణారెడ్డి… దత్తుగారితో చేసిన ‘శుభలగ్నం’ మంచి విజయాన్ని అందించింది.’గోవిందా గోవిందా’ సినిమా వల్ల దత్తుగారికి మిగిలిన నష్టాలని తీర్చేయడమే కాకుండా.. ‘శుభలగ్నం’ కి పెట్టిన బడ్జెట్ కు పదిరెట్లు లాభాలను అందించింది’ అంటూ చెప్పుకొచ్చారు.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!