Super Police Movie: 29 ఏళ్ళ వెంకటేష్ ‘సూపర్ పోలీస్’ గురించి 10 ఆసక్తికర విషయాలు!

విక్టరీ వెంకటేష్ హీరోగా నగ్మా, సౌందర్య హీరోయిన్లుగా జయసుధ కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సూపర్ పోలీస్’. మూవీ మొఘల్ డా.డి.రామానాయుడు సమర్పణలో ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1994 వ సంవత్సరం జూన్ 23 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేటితో ఈ చిత్రం విడుదలై 29 ఏళ్ళు పూర్తి కావస్తోంది. అందుకే సోషల్ మీడియాలో ‘#29YearsForSuperPolice ‘ అనే హ్యాష్ ట్యాగ్ ను కొంతమంది వెంకటేష్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ పోలీస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) ‘బొబ్బిలి రాజా’ ‘శత్రువు’ ‘కూలీ నెంబర్ 1’ , ‘చంటి’, ‘సుందరకాండ’, ‘కొండపల్లి రాజా’, ‘అబ్బాయి గారు’ వంటి హిట్స్ అందుకుని మంచి ఫామ్లో ఉన్న టైంలో ఓ మంచి కమర్షియల్ సినిమా చేయాలని వెంకటేష్, సురేష్ బాబు అనుకున్నారు.

2) ఆ టైంలో సురేష్ బాబు గారికి వెంకటేష్ ని ఒక ఫుల్ లెంగ్త్ పోలీస్ ఆఫీసర్ గా చూపిస్తే బాగుంటుంది అనుకున్నారు. వెంటనే తనకు పరిచయం ఉన్న రైటర్స్ కి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది.అలాగే ఏదైనా సినిమాని రీమేక్ చేయాలా? అని పక్క భాషల్లోని సినిమాలను కూడా చూస్తూ వచ్చారు.కానీ సురేష్ బాబుకి ఏది నచ్చలేదు.

3) ఈ క్రమంలో గుహనాథన్ సురేష్ బాబుకి సూపర్ పోలీస్ కథని వినిపించారు. ఇది సురేష్ బాబుకి నచ్చింది. కొన్ని మార్పులతో స్క్రిప్ట్ రెడీ చేయించుకున్నారు.

4) ఈ కథని డైరెక్ట్ చేయడం కోసం ఇద్దరు, ముగ్గురు పెద్ద దర్శకులను సంప్రదించారు. కానీ వాళ్ళు ఆ టైంలో వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయారు. దీంతో కె మురళీ మోహన్ రావు దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు.

5) అంతకు ముందు కె మురళీ మోహన్ రావు వెంకటేష్ తో ‘బ్రహ్మరుద్రులు’, ‘త్రిమూర్తులు’ వంటి సినిమాలు చేశారు. ఇవి రెండూ ఫ్లాప్ అయ్యాయి. అయితే ‘చంటి’ రీమేక్ ‘అనారి’ ని హిందీలో డైరెక్ట్ చేసింది కె మురళీ మోహన్ రావు..! ఆ సినిమా అక్కడ సక్సెస్ అయ్యేలా తీశారు కాబట్టి..’సూపర్ పోలీస్’ కి అతన్నే దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు సురేష్ బాబు.

6) ఎంవీఎస్ హరనాథరావు ‘సూపర్ పోలీస్’ (Super Police) ఫైనల్ వెర్షన్ ను రెడీ చేయడం జరిగింది.

7) సంగీత దర్శకుడిగా అప్పటికి ‘రోజా’ ‘జెంటిల్ మెన్’ వంటి సినిమాలతో ఫామ్లో ఉన్న రెహమాన్ ను ఎంపిక చేసుకున్నారు. తెలుగులో రెహమాన్ సంగీతం అందించిన మొదటి సినిమా ఇది.

8) ‘సూపర్ పోలీస్’ సినిమా షూటింగ్ పోర్షన్ కోసం కొంచెం ఎక్కువ టైమే పట్టింది అని చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ కోసం ఆ రోజుల్లోనే దాదాపు 81 వర్కింగ్ డేస్ కేటాయించాల్సి వచ్చిందట. ఫైనల్ గా కిందా మీదా పడి షూటింగ్ ను కంప్లీట్ చేశారు.

9) 1994 జూన్ 23న సినిమాని రిలీజ్ చేశారు. కానీ ఫలితం కంప్లీట్ గా తేడా కొట్టింది.ఓ పోలీస్ ఆఫీసర్ సిన్సియర్ గా ఉంటూనే కామెడీ చేయడం మరోపక్క రాత్రి పూట అతను తాగుబోతులా కనిపించడం వెంకీ ఫ్యాన్స్ కి నచ్చలేదు. ప్రియురాలు చనిపోవడానికి విలన్ గ్యాంగ్ కారణం అనే విషయం కూడా ఎప్పటికో రివీల్ అవుతుంది. ఇవన్నీ ఆ టైంలో ప్రేక్షకులకి రుచించలేదు.

10) పాటలు బాగున్నా.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా లేవు అనే విమర్శలు ఆ రోజుల్లోనే ఎదుర్కొంది ‘సూపర్ పోలీస్’ చిత్రం.

11) సూపర్ పోలీస్ లో కొన్ని సన్నివేశాలు బాగుంటాయి. సినిమా స్టార్టింగ్లో జయసుధ పిల్లలు వెంకటేష్ అండ్ బ్యాచ్ ను ఏడిపించే సన్నివేశాలు కావచ్చు, సెకండ్ హాఫ్ లో వెంకీ పోలీస్ స్టేషన్ మూసేసి కానిస్టేబుల్స్ తో క్రికెట్ ఆడుకునే సీన్ కావచ్చు .. చూడటానికి బాగానే ఉంటాయి. రామానాయుడు గారు కూడా ఈ సినిమాలో చిన్న అతిధి పాత్ర పోషించారు.’జర్నలిస్ట్’ గా చేసిన జయసుధ సింపుల్ గా మద్యం బాటిల్ కి పెట్టిన బాంబ్ కి బలైపోవడం అనేది ఆ రోజుల్లోనే జనాలకి చాలా సిల్లీగా అనిపించింది. ఇక క్లైమాక్స్ లో వెంకీ చేసే స్టంట్ లు కూడా జనాలకి కామెడీగా అనిపించాయి.

12) ఇప్పుడు యూట్యూబ్ లో చూడటానికి ఈ సినిమా బాగానే అనిపిస్తుందేమో కానీ.. ఆ టైంలో అయితే వెంకీ వరుస హిట్లతో దూసుకుపోతున్న టైంలో భారీ అంచనాల నడుమ ఈ సినిమా రిలీజ్ అవ్వడంతో .. ‘సూపర్ పోలీస్’ ప్లాప్ మూవీగా మిగిలిపోయింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus