Zaara Patel: రష్మిక డీప్ ఫేక్ వీడియోలో కనిపించిన అమ్మాయి ఎవరో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందనకి సంబంధించిన ఇటీవల ఓ ఫేక్ వీడియో వచ్చిన సంగతి తెలిసిందే. డీప్ ఫేక్ అనే యాప్ ద్వారా ఆ వీడియోని మార్ఫింగ్ చేసినట్లు తేలింది. ఇది చూసిన రష్మిక ఒక్కసారిగా షాక్ అయిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఆ వీడియోలో రష్మికని అశ్లీలంగా చూపించారు. దీంతో రష్మిక సోషల్ మీడియాలో బాధపడుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘ఇప్పుడు నాకు ఇంతమంది అండగా నిలబడ్డారు కాబట్టి సరిపోయింది.

అదే ఒకప్పుడు అయితే నేను ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కొనేదాన్నో.. ఎలాంటి ఘోరమైన నిర్ణయాలు తీసుకునేదాన్నో’ అంటూ రాసుకొచ్చింది.ఇక అమితాబ్ బచ్చన్ నుండి చాలా మంది సెలబ్రిటీలు రష్మికకి అండగా నిలబడుతున్నట్టు తెలిపి.. అలాంటి వీడియోలు చేసిన వారిపై కేసు పెట్టాలని ఘాటుగా స్పందించారు. అయితే ఆ వీడియోలో ‘రష్మిక ప్లేస్ లో కనిపించిన అమ్మాయి ఎవరా?’ అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ క్రమంలో ఆ వీడియోలో ఉన్న అమ్మాయి పేరు జారా పాటెల్‌ అని తేలింది. ఆమె ఓ బ్రిటీష్‌-ఇండియన్‌.

అక్టోబర్‌ 9న ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. ఆమెకు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 4 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకా జారా గురించి చెప్పాలంటే .. ఆమె ఓ ఇంజనీర్ అని తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లో రాసి ఉంది. ఇక ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆమె ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటుందట. అంతేకాకుండా తన వీడియోకి రష్మిక ఫేస్ పెట్టడం పై ఆమె కూడా షాక్ అయ్యిందట. ఈ వీడియో చూసి రష్మిక విషయంలో ఈమె (Zara Patel) కూడా ఫీలైనట్టు ఆమె తెలిపింది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus