Seshu: 21 ఏళ్ళ రాజశేఖర్ ‘శేషు’ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు!

  • March 1, 2023 / 12:03 PM IST

రాజశేఖర్ ఇమేజ్ ఇప్పుడంటే.. పడిపోయింది కానీ ఒకప్పుడు ఆయన కూడా స్టార్ స్టేటస్ ను అనుభవించిన వారే. చిరంజీవి,బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి హీరోలకు గట్టి పోటీ ఇచ్చేవారు ఈయన. ఇదిలా ఉండగా టాలీవుడ్లో రీమేక్ సినిమాలు ఎక్కువగా చేసిన హీరోల్లో రాజశేఖర్ కూడా ఉంటారు. ఆయనకు పక్క భాషలో ఓ సినిమా నచ్చింది అంటే.. దాన్ని ఆయన వదిలిపెట్టరు. ఆ రైట్స్ వేరే వాళ్ళు తీసుకున్నా సరే.. వదులుకోవడం ఇష్టం లేక వెళ్లి అడిగి మరీ తెచ్చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది పక్కన పెడితే రాజశేఖర్ చేసిన రీమేక్ సినిమాల్లో ‘శేషు’ కూడా ఒకటి. ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటితో 21 ఏళ్ళు పూర్తవుతుంది కాబట్టి.. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) రాజశేఖర్ తమిళ సినిమా సేతు చూసి ఇంప్రెస్ అయిపోయి.. ఈ చిత్రాన్ని ఎలాగైనా తెలుగులో రీమేక్ చేయాలని… తాను డేట్స్ ఇచ్చిన నిర్మాతతో రైట్స్ కొనుగోలు చేయించాలి అనుకున్నారు.

2) తాను సినిమా చేస్తాను అని సైన్ చేసిన నిర్మాతలను పిలిచి ఆ విషయం చెప్పగా ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించలేదు.

3) మరోపక్క పవన్ కళ్యాణ్ కు కూడా ఈ చిత్రం నచ్చింది. కాకపోతే తెలుగు ప్రేక్షకులకు తగినట్టు కొన్ని మార్పులు చేసి రీమేక్ చేస్తే బాగుణ్ణు అని భావించారు.పవన్ కూడా తాను సినిమా చేయడానికి సైన్ చేసిన నిర్మాతలకు ఈ విషయాన్ని చెప్పారు.

4) పవన్ వెంటనే సినిమా చేస్తాను అంటే ఏ నిర్మాత వద్దనుకుంటాడు చెప్పండి. వెంటనే ‘సేతు’ రీమేక్ హక్కులు కొనుగోలు చేయడానికి నిర్మాత ఎ.కందసామి ని సంప్రదించారు. కానీ అప్పటికే రాజశేఖర్ ‘సేతు’ రీమేక్ హక్కులను కొనుగోలు చేసినట్లు వారికి తెలిసింది.

5) ఈ క్రమంలో ఆ నిర్మాతలు రాజశేఖర్ కు ఫోన్ చేసి, ఆ రైట్స్ ను తమకు ఇచ్చేయమని… బదులుగా ఇంకాస్త ఎక్కువేసి ఇస్తామని చెప్పారు. కానీ రాజశేఖర్ అందుకు ఒప్పుకోలేదు. ఆ సినిమాని తానే చేస్తానని గట్టిగా చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న పవన్… లైట్ తీసుకున్నారు.

6) 1999 డిసెంబర్ 10న రిలీజ్ అయిన ‘సేతు’ సినిమా.. తమిళనాడులో బాగా ఆడింది. ‘బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ తమిళ్’ కేటగిరిలో నేషనల్ అవార్డు కూడా దక్కింది. బాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ …. తన నట విశ్వరూపాన్ని చూపించాడు. అందుకే ఈ సినిమా పై రాజశేఖర్,పవన్ ఇంట్రెస్ట్ చూపించారు.

7) ‘శేషు’ పేరుతో తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని భావించిన రాజశేఖర్.. మొదట్లో ఓ కొత్త దర్శకుడిని పట్టారు. కానీ అతను ఈ కథని యాజ్ ఇట్ ఈజ్ గా చేస్తే ప్లాప్ అవుతుంది.. కొన్ని మార్పులు చేద్దాం అన్ని చెప్పారట. కానీ రాజశేఖర్ కు అది ఇష్టం లేదు.

8) అందుకే ఆ దర్శకుడిని పక్కన పెట్టి వేరే దర్శకుడి కోసం గాలించారు. ఎక్కువ శాతం ఆ దర్శకుడు చెప్పినట్టే చేశారు. దీంతో రాజశేఖర్ సతీమణి మొదటిసారి డైరెక్టర్ గా మారారు. స్క్రీన్ పై ఆమె పేరే పడింది. కానీ వేరే వాళ్ళతో డైరెక్ట్ చేయించి ఈమె పేరు వేయించుకున్నారు అని కూడా ఓ టాక్ ఉంది. కానీ దాని పై క్లారిటీ లేదు.

9) ‘శివ శివాని మూవీస్’ అనే బ్యానర్ ను స్థాపించి శివాని పేరు పై జీవిత రాజశేఖర్లే ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ‘సేతు’ కి ఇళయరాజా సంగీతం అందించగా.. ‘శేషు’ కి ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం విశేషం.ఈ చిత్రంతో కళ్యాణి తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

10) 2002 ఫిబ్రవరి 28 న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మొదటి షోకే సినిమా ప్లాప్ అని తేల్చేశారు ప్రేక్షకులు. ఒరిజినల్ ను యాజ్ ఇట్ ఈజ్ గా దింపేయడం, ఒరిగినల్ దర్శకుడు బాల క్యారీ చేసిన ఫీల్ ను, ఎమోషన్ ను.. ఇక్కడ జీవిత రాజశేఖర్ తన డైరెక్షన్ తో క్యారీ చేయలేకపోవడంతో.. ‘శేషు’ డిజాస్టర్ అయ్యింది. కానీ రాజశేఖర్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా వల్ల నిర్మాతలైన జీవిత రాజశేఖర్లకు చాలా డబ్బు పోయింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus