బాగా చదివి జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలని చాలా మంది కల. ఇంకొందరికైతే చదువే జీవితం. అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా చదవును మాత్రం ఆపరు. కానీ చదువుకోవాలనే కోరిక వున్నా.. ఆర్ధిక ఇబ్బందులు, ఇతరత్రా కారణాల వల్ల కొందరికి వీలుపడదు. ఇక మరికొందరికైతే డబ్బు, ఆస్తులు వున్నా చదువుకోవడం కుదరదు . ఈ కోవలోకి వస్తారు సీనియర్ హీరోయిన్ రజినీ. 80వ దశకంలో దక్షిణాదిని ఒక ఊపు ఊపిన ఆమె.. దాదాపు 150 సినిమాల్లో హీరోయిన్ గా నటించారు.
ఒకప్పుడు తీరిక లేకుండా షూటింగ్ లలో బిజీగా గడిపిన రజినీ ఇప్పుడు పెళ్లయి.. ముగ్గురు పిల్లల తల్లిగా కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే రజినీ నిజానికి పెద్దగా చదువుకోలేదు. తొమ్మిదో తరగతి మాత్రమే పాసయ్యారు. పదో తరగతిలోకి వెళ్లబోతుండగా 1984లో రజినీకి సినిమాల్లో అవకాశం వచ్చింది. అయితే ఎక్కడో ఆమెను చూసిన ప్రొడక్షన్ మేనేజర్.. పిల్ల అందంగా వుంది, హీరోయిన్‌గా బాగుంటుందని డైరెక్టర్ మణివణ్ణన్‌కు చెప్పాడట.
దీంతో వాళ్లు రజినీ వాళ్ల నాన్నను పిలిపించి విషయం చెప్పారు. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోలేని ఆయన.. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను అడిగి ఏ విషయం చెబుతానని అన్నాడట. ఈ విషయం తెలుసుకున్న రజినీ వాళ్లమ్మ గారు… ఏదో లాగా ఆయనను ఒప్పించారు. అలా మణివణ్ణన్ దర్శకత్వంలో మోహన్ హీరోగా ‘‘ఇళమే కాలందు’’తో సినీరంగ ప్రవేశం చేశారు రజనీ.
అలాగే కేవలం తొమ్మిదో తరగతితోనే రజినీ చదువుకు ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. అయితే ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయానన్న తృప్తి ముందు ఈ బాధ ఏపాటిది.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?