నాగార్జున సతీమణి అమల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగుతో పటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈమె ఎన్నో చిత్రాల్లో నటించింది. నాగార్జున హీరోగా నటించిన ‘కిరాయి దాదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అమల.. అటు తరువాత వెంకటేష్ తో ‘రక్తతిలకం’ ‘అగ్గిరాముడు’, చిరంజీవి తో ‘రాజా విక్రమార్క’, రాజశేఖర్ తో ‘ఆగ్రహం’.. మళ్ళీ నాగార్జునతో ‘చినబాబు’ ‘శివ’ ‘నిర్ణయం’ ‘ప్రేమ యుద్ధం’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.
నాగార్జునతో పెళ్ళైన తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన అమల.. ‘బ్లూ క్రాస్’ అనే జంతువుల పరిరక్షణ కేంద్రాన్ని స్థాపించి మానవత్వాన్ని చాటుకుంటూ గొప్ప మహిళగా పేరుతెచ్చుకుంది. ఇక అమల తండ్రి ముఖర్జీ ఓ బెంగాలీ.కలకత్తాకు చెందిన వ్యక్తి. ఇతను నేవీ ఆఫీసర్ గా పనిచేసాడు. ఇక అమల తల్లి ఐర్లాండ్ దేశానికి చెందిన మహిళ. అమల తండ్రి ముఖర్జీది ప్రేమ వివాహం.
అటు తరువాత ముఖర్జీ ఖరగ్పూర్ లో ప్రొఫెసర్ గా కూడా పనిచేసారు. అమల తల్లి హాస్పిటల్ మేనేజ్మెంట్ జాబ్ చేసేది. అమల తల్లిదండ్రులు వైజాగ్, చెన్నై వంటి ఊర్లలో కూడా కొన్నాళ్ల పాటు జీవనం కొనసాగించారు. ఇక అమల పెళ్లి చేసుకున్న తరువాత.. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ‘మనం’ వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.
Most Recommended Video
గుంజన్ సక్సెనా: ది కార్గిల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!
రిలీజ్ తర్వాత చాలా లేట్ గా టీవీల్లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్..!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?